రేపు తిరుపతిలో రాహుల్‌ పర్యటన

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో రాహుల్ తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనానంతరం జ్యోతిరావుపూలే సర్కిల్ నుంచి తారకరామ స్టేడియం వరకు రాహుల్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:01 am, Thu, 21 February 19