నేడు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తొలి కేబినెట్‌ సమావేశం నేడు జరగనుంది. కేబినెట్ విస్తరణ తర్వాత తొలిసారిగా మంత్రివర్గం సమావేశమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క మంత్రితో సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు నెలల అనంతరం కేబినేట్ ను విస్తరించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు లక్షల మార్కును […]

నేడు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
Follow us

| Edited By:

Updated on: Feb 21, 2019 | 11:19 AM

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ తొలి కేబినెట్‌ సమావేశం నేడు జరగనుంది. కేబినెట్ విస్తరణ తర్వాత తొలిసారిగా మంత్రివర్గం సమావేశమవుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక్క మంత్రితో సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండు నెలల అనంతరం కేబినేట్ ను విస్తరించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రెండు లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. ఎన్నికల హామీల అమలు దిశగా బడ్జెట్ లో కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయితీ రాజ్, జీఎస్టీ సవరణ బిల్లులకూ కేబినెట్ ఆమోదం తెలపనుంది. కాగా సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖను తనవద్దే పెట్టుకోవడంతో అసెంబ్లీలో బడ్జెట్ ను కూడా ఆయనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.