ఈఓ బదిలీ.. అక్టోబర్ 16 నుండి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
దేవదేవుడు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 16 నుండి 24 వరకు జరుగుతాయి. తిరుమల కొండపై ప్రస్తుతం కొనసాగుతోన్న సుందరకాండ దీక్ష అక్టోబర్ 14 వరకు ఉంటుంది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, నిన్న(బుధవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.43కోట్లుకాగా, శ్రీవారిని 15,390 […]
దేవదేవుడు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 16 నుండి 24 వరకు జరుగుతాయి. తిరుమల కొండపై ప్రస్తుతం కొనసాగుతోన్న సుందరకాండ దీక్ష అక్టోబర్ 14 వరకు ఉంటుంది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా, నిన్న(బుధవారం) శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.43కోట్లుకాగా, శ్రీవారిని 15,390 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 4,811 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.