అసలు సమస్య పాకిస్థాన్ కాదు..

అక్కడే తప్పు జరిగింది, ప్రత్యేక దేశంలా అయ్యింది భారత సైన్యానికి సవాలు, ఉగ్రవాదమే వారి ఆయుధం అసలు సమస్య ఇదే, ఆర్టికల్ 370 అన్నింటిలోనూ మోకాలడ్డుతోంది, చైనాకు ఎందుకంత కోపం? తక్షణ కర్తవ్యం?   శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలు, విభేదాలపై పెద్ద చర్చ తెర మీదకు వచ్చింది. శాశ్వత పరిష్కారం ఉండాలంటు పలువురు ప్రముఖులు సైతం అంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో సరిపెడితే లాభం లేదని, యుద్ధమే సరైనదని వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడే తప్పు జరిగింది.. […]

అసలు సమస్య పాకిస్థాన్ కాదు..
Follow us

|

Updated on: Feb 20, 2019 | 5:05 PM

  • అక్కడే తప్పు జరిగింది, ప్రత్యేక దేశంలా అయ్యింది
  • భారత సైన్యానికి సవాలు, ఉగ్రవాదమే వారి ఆయుధం
  • అసలు సమస్య ఇదే, ఆర్టికల్ 370
  • అన్నింటిలోనూ మోకాలడ్డుతోంది, చైనాకు ఎందుకంత కోపం?
  • తక్షణ కర్తవ్యం?

శ్రీనగర్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సంబంధాలు, విభేదాలపై పెద్ద చర్చ తెర మీదకు వచ్చింది. శాశ్వత పరిష్కారం ఉండాలంటు పలువురు ప్రముఖులు సైతం అంటున్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో సరిపెడితే లాభం లేదని, యుద్ధమే సరైనదని వాదనలు వినిపిస్తున్నాయి.

అక్కడే తప్పు జరిగింది..

అసలు సమస్య కశ్మీరే. భారత దేశం మొత్తం ఒకెత్తు అయితే కశ్మీర్ మాత్రం మరో ఎత్తు. దాని రాజ్యాంగం వేరు. భారత రాజ్యాంగం వేరు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలేమిటనేది ఇక్కడ అసలు ప్రశ్న. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. దీనికి కారణం స్వాతంత్ర్యం సిద్ధించిన సమయంలో జరిగిన తప్పే. అప్పట్లో కశ్మీర్ రాజు పాకిస్థాన్ తమను ఆక్రమిస్తోందని గ్రహించి భారత్‌లో కలిసేందుకు సుముఖుత వ్యక్తం చేస్తూ భారత్‌ను సంప్రదించాడు. కానీ భారత్ ఐక్యరాజ్య సమితిని సంప్రదించింది.

ప్రత్యేక దేశంలా అయ్యింది..

ఐక్యరాజ్య సమితి అంగీకారంతో భారత్‌లో కలుపుకోవాలని చూసింది. దీంతో విషయంలో ప్రపంచ దేశాల జోక్యం ప్రవేశించింది. ఈ వ్యవహారం అంతా జరిగే సమయానికే పాకిస్థాన్ కశ్మీర్‌లోని చాలా భూభాగాన్ని ఆక్రమించింది. దాన్నే ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అని పిలుస్తున్నాం. తదుపరి కశ్మీర్‌ భారత్‌లో పూర్తిగా కలవలేదు. దానికి ప్రత్యేక రాజ్యాంగం ఏర్పాటైంది. భారత్‌లో ఉన్న ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడికి వెళ్లి స్థిరపడటానికి వీల్లేదు. కశ్మీర్‌లో ఆస్థులు కొనకూడదు. అక్కడ వ్యాపారాలు చేయకూడదు. అందుకే కశ్మీర్ పేరుకు భారత్‌లో భాగమే అయినా.. ప్రత్యేక దేశంలా అనిపిస్తుంది.

భారత సైన్యానికి సవాలు

అప్పట్లో జరిగిన చిన్న మిస్టేక్‌వల్ల కశ్మీర్‌లో రావణకాష్టం ఇప్పటికీ రగులుతూనే ఉంది. భారత్‌తో సంబంధం లేని ప్రత్యేక కశ్మీర్ కావాలని కొందరు, పాకిస్థాన్‌లో కలవాలని మరికొందరు ఏర్పాటువాదులు భారత్‌కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. అందుకు హింస మార్గాన్ని ఎంచుకుని, ఉగ్రవాదాన్ని కూడా ఆశ్రయిస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు అణిచివేసేందుకు భారత సైన్యం ప్రయత్నాలు చేస్తూ వస్తోంది.

ఉగ్రవాదమే వారి ఆయుధం

దీంతో పాటు కశ్మీరీ ప్రజలకు నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. కశ్మీరీల ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎంత చేసినప్పటికీ మత ఛాందసవాదులు, పాకిస్థాన్ ప్రేరేపితుల కారణంగా మంట రగులుతూనే ఉంది. చాలా మంది తీవ్రవాదులుగా మారిపోతున్నారు. పాకిస్థాన్ నుంచి పని చేస్తోన్న ఉగ్రవాద సంస్థల నుంచి ప్రేరణ, ఆర్ధిక సహాయం, బాంబులు, గన్స్ పొందుతూ భారత్‌పైకే దాడికి దిగుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు చైనా కూడా సహకరిస్తోందన్న వాదనలు కూడా ఉన్నాయి.

అసలు సమస్య ఇదే.. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కశ్మీర్‌కు లింక్ ఉంది. పైకి కనబడుతున్నట్టు పాకిస్థానే సమస్య అయినప్పటికీ అసలు సమస్య వేరే ఉంది. అదే స్థానిక తీవ్రవాదం. భారత్‌ నుంచి విడిపోవాలని కోరుకుంటున్న ఏర్పాటువాదులు, పాకిస్థాన్‌లో కలవాలనుకుంటున్న వాళ్లు భారత్‌కు వ్యతిరేకంగా తయారవుతున్నారు. దాడులకు తెగబడుతూ మారణహోమానికి తెర తీస్తున్నారు. పాకిస్థాన్ సంగతి పక్కన పెడితే స్థానికంగా పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ముందుగా అరికట్టాల్సిన అవసరం ఉంది.

ఆర్టికల్ 370

అందుకు భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్టికల్ 370పై దృష్టి సారించాలి. కశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని సాధ్యం చేసిన ఆ ఆర్టికల్‌ను రాజ్యంగం నుంచి తప్పించాలి. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దేశ వ్యాప్తంగా ఇది పెరుగుతూ వస్తోంది. ఇలా ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా అది మరింత హైలెట్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వంపై కూడా ఈ ఒత్తిడి ఉంది.

అన్నింటిలోనూ మోకాలడ్డుతోన్న చైనా భారత్ కశ్మీర్ విషయంలో ఏం చేయాలన్నా ప్రపంచ దేశాల నుంచి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ ససేమిరా అడ్డు తగులుతుంది. దానికి చైనా వంత పాడుతుంది. చైనా ఇక్కడ చాలా కీలకం. వీటో పవర్ ఉన్న దేశం కావడంతో భారత్‌కు చైనా మోకాలడ్డుతుంది. దీంతో ఏం చేయాలనుకున్నా అది కార్యరూపం దాల్చే పరిస్థితి ఉండదు.

పుల్వామా ఉగ్రదాడి చేసినట్టు ప్రకటించిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు మద్దతు తెలపాల్సిందిగా చైనాను భారత్ కోరినప్పుడు తోసిపుచ్చింది. మరో పక్క వీటో పవర్ ఉన్న మరో దేశం ఫ్రాన్స్ మాత్రం తాము మద్దతు తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యంత్వం కోసం భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కానీ అందుకు చైనా అంగీకరించడం లేదు. ఇలా అన్ని విషయాల్లోనూ భారత్‌కు చైనా అడ్డుపడుతూనే ఉంది.

చైనాకు ఎందుకంత కోపం? అయితే మరి చైనా ఇలా ఎందుకు చేస్తోంది? అంటే.. ఇప్పుడు చైనా అగ్ర దేశంగా నిలబడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికాను దాటి నిలబడాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు ఆసియా ఖండంలో ఎదురులేని శక్తిగా మారాలి చూస్తోంది. అయితే చైనాకు భారత్ నుంచి గట్టి పోటీ ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భారత్ అన్ని విషయాల్లోనూ చైనాను బీట్ చేయగల సత్తా కలిగి ఉంది. దీంతో భారత్‌ను ఆ స్థాయికి రానివ్వకూడదనే దుర్బుద్ధితో చైనా ఎప్పటకప్పుడు మోకాలడ్డుతోంది.

తక్షణ కర్తవ్యం? ఈ విచిత్ర పరిస్థితుల నేపథ్యంలోనే భారత్ ఆచి తూచి అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మద్దతు కోసం ఎప్పటికప్పుడు పావులు కదుపుతూ వస్తోంది. ఒక పక్క అభివృద్ధివైపు పరుగులు పెడుతూనే ఆర్ధిక పరిపుష్టతను సాధించాలి. మరోపక్క కశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఒక్కొక్కటిగా చక్కబెట్టుకు వస్తూ మరోవైపు అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలి. ప్రపంచం ముందు తిరుగులేని శక్తిగా భారత్ నిలబడగలిగినప్పుడు భారత్ మాటను ప్రపంచం పాటిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..