అమ్మపిలుపుతో ప్రాణం పోసుకున్నాడు..
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తర్వాత.. అమ్మ పిలుపుతో కుమారుడు లేచిన ఘటన సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని ఆ తల్లి తల్లడిల్లింది. విలపిస్తూనే ఆ కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అమ్మ విలపిస్తున్న ఆ శబ్ధానికి ఆ కొడుకు కళ్ళలోంచి నీళ్లు కారడాన్ని గుర్తించిన స్థానికులు ఆర్‌ఎంపీని పిలిపించి నాలుగైదు రోజులు వైద్యం అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మ ప్రేమే పునర్జన్మ నిచ్చిందని […]
అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తర్వాత.. అమ్మ పిలుపుతో కుమారుడు లేచిన ఘటన సూర్యాపేట జిల్లాలోని పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు తమకిక లేకుండా పోతున్నాడని ఆ తల్లి తల్లడిల్లింది. విలపిస్తూనే ఆ కుమారుడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది. అమ్మ విలపిస్తున్న ఆ శబ్ధానికి ఆ కొడుకు కళ్ళలోంచి నీళ్లు కారడాన్ని గుర్తించిన స్థానికులు ఆర్‌ఎంపీని పిలిపించి నాలుగైదు రోజులు వైద్యం అందించారు. దీంతో స్పృహలోకి వచ్చిన అతడు మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మ ప్రేమే పునర్జన్మ నిచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పిల్లలమర్రి గ్రామానికి చెందిన సైదమ్మకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోవడంతో తానే ఇంటి పెద్ద అయి పిల్లలిద్దరిని చదివించుకుంటోంది. చిన్న కుమారుడు కిరణ్‌కు జూన్ 26న వాంతులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు పరిస్థితి విషమించిందని.. బ్రెయిన్ డెడ్ అయిందని తెలిపారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న బంధుమిత్రులు అంత్యక్రియలు చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు. తన కొడుకు ఇక లేడని తల్లి సైదమ్మ గట్టిగా ఏడవడంతో.. ఆ పిలుపుకు అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో కిరణ్‌ను ఆస్పత్రిలో జాయిన్ చేసి.. చికిత్స అందించారు. చనిపోయాడు అనుకున్న కొడుకు బతకడంతో.. కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.