ఆరుగురు కామాంధులు.. ఒకటి కాదు రెండు కాదు వందల నేరాలు

కామాంధుల సెల్ ఫోన్లలో వందల సంఖ్యలో బాధిత మహిళల అశ్లీల వీడియోలు గుర్తించి పోలీసులు అవాక్కయ్యారు. కామాంధులను రిమాండ్‌కు తరలించి వారు చేసిన నేరాల చిట్టాను బయటకు తెస్తున్నారు...

ఆరుగురు కామాంధులు.. ఒకటి కాదు రెండు కాదు వందల నేరాలు
Sanjay Kasula

|

Jun 16, 2020 | 4:25 PM

ఒంటరి మహిళ కనిపిస్తే కాటు వేసే రేపిస్టు గ్యాంగ్స్ ఇప్పుడు తమిళనాడులో కలకలం సృష్టిస్తున్నాయి. రామనాథపురం జిల్లాలో బయటపడిన రేపిస్ట్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పరమకుడిలో వరుస అత్యాచారలు చేస్తున్న గ్యాంగ్‌ను పట్టుకున్నారు.

ఒంటరి మహిళలు , భర్త చనిపోయిన మహిళలే ఈ గ్యాంగ్ టార్గెట్ చేస్తూన్నట్లు పోలీసులు గుర్తించారు. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళలను టార్గెట్ చేసి అచారానికి ఒడిగట్టారు. ముందుగా మహిళను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. ఒకరు కాదు… ఏకంగా ఆరుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై వీడియో తీసిన ఆ ముగ్గురు నిందితులు తమతో సంబంధం పెట్టుకోవాలని.. అడిగినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతే వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇలాంటి వరుస ఘటనలతో రామనాథపురం జిల్లా గత కొద్ది రోజులుగా వణికిపోయింది. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ పోలీస్ టీమ్ రేపిస్టు గ్యాంగ్ ను పట్టుకుంది.

స్పెషల్ పోలీసులు  ఏర్పాటు చేసిన నిఘాకు  ఆరుగురు కామాంధులు చిక్కారు. తమదైన తరహాలో తీగలాగితే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. కామాంధుల సెల్ ఫోన్లలో వందల సంఖ్యలో బాధిత మహిళల అశ్లీల వీడియోలు గుర్తించి పోలీసులు అవాక్కయ్యారు. కామాంధులను రిమాండ్‌కు తరలించి వారు చేసిన నేరాల చిట్టాను బయటకు తెస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu