CORONA EFFECT 17వేల మంది ఖైదీలకు స్వేచ్ఛ

కరోనా ప్రభావం చూపని రంగమంటూ కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అసాధ్యమనుకుంటున్న విషయాలెన్నో కరోనా ప్రభావంతో మారిన పరిస్థితుల్లో సాధ్యమవుతున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.

CORONA EFFECT 17వేల మంది ఖైదీలకు స్వేచ్ఛ
Follow us

|

Updated on: May 13, 2020 | 2:18 PM

కరోనా ప్రభావం చూపని రంగమంటూ కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు అసాధ్యమనుకుంటున్న విషయాలెన్నో కరోనా ప్రభావంతో మారిన పరిస్థితుల్లో సాధ్యమవుతున్నాయి. దీనికి చక్కని ఉదాహరణ మహారాష్ట్రలో బుధవారం చోటుచేసుకుంది.

మహారాష్ట్రలోని వివిధ జైళ్ళలో మొత్తం 35 వేల మంది ఖైదీలు వివిధ నేరారోపణలతోను, నేర నిర్ధారణలతోను జైలు జీవితాన్ని గడుపుతున్నారు. వారిలో కొందరు పెరోల్‌కు అప్లై చేసుకున్న వారు కాగా.. మరికొందరు పెరోల్ అప్లై చేయని వారూ వున్నారు.

తాజాగా మహారాష్ట్రలోని అర్దర్ జైలులో 185 మంది ఖైదీలను కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో జైళ్ళ శాఖ ఉలిక్కి పడింది. భారీ సంఖ్యలో ఖైదీలను పెరోల్‌పై విడుదల చేయాలని సంకల్పించింది. దీనిక మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర హోం మంతి అనిల్ దేశ్‌ముఖ్ కథనం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం ఖైదీలలో 50 శాతం అంటే 17 వేల మందికి పైగా ఖైదీలను కరోనా ప్రభావంతో పెరోల్‌పై విడుదల చేయనున్నారు. వీరిలో 5 వేల మంది ఖైదీలు అండర్ ట్రయల్‌ కింద జైళ్ళలో మగ్గుతున్న వారున్నారు.

ఏడేళ్ళు అంత కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన 3 నుంచి 9 వేల మందిని కూడా పెరోల్‌ మీద విడుదల చేయనున్నట్లు అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. అత్యాచారాలు, ఆర్థిక నేరాలు, బ్యాంకులను ముంచిన వారు. మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ నియంత్రణా చట్టం కింద శిక్ష పడిన వారు, తీవ్ర వాదులు, ఉగ్రవాదులు, టాడా చట్టం కింద శిక్ష పడిన వారిని మాత్రం విడుదల చేయడం లేదని మంత్రి వివరణ ఇచ్చారు.