మోదీ చెప్పడమే ఆలస్యం.. వెంటనే అమలు పర్చిన అమిత్ షా..

రాజకీయాల్లో మోదీ,షాల ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరు పైకి మాట్లాడితే.. మరొకరు సైలంట్‌గా అమలు చేస్తుంటారు. ముఖ్యంగా రెండో సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. దీంతో మళ్లీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల వాడకానికి […]

మోదీ చెప్పడమే ఆలస్యం.. వెంటనే అమలు పర్చిన అమిత్ షా..
Follow us

| Edited By:

Updated on: May 13, 2020 | 3:23 PM

రాజకీయాల్లో మోదీ,షాల ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకరు పైకి మాట్లాడితే.. మరొకరు సైలంట్‌గా అమలు చేస్తుంటారు. ముఖ్యంగా రెండో సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు తీసుకున్న సంచలన నిర్ణయాలు తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడింది. దీంతో మళ్లీ దేశ ఆర్ధిక వ్యవస్థను గాడినపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని మోదీ స్వదేశీ వస్తువుల వాడకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. “ఆత్మ నిర్భర్ భారత్” పేరుతో ప్రధాని మోదీ ఈ పిలుపునిచ్చారు. అయితే ప్రధాని మోదీ సందేశానికి వెంటనే అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఇకపై స్వదేశీ వస్తువులను ప్రోత్సహించేలా.. చర్యలు ప్రారంభించారు.

జూన్ 1వ తేదీ నుంచి.. దేశంలోని అన్ని కేంద్ర బలగాలకు సంబంధించిన క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే అమ్మాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దీంతో సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌కు చెందిన 10 లక్షల మంది సైనికులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను వాడనున్నారు. ప్రతి ఏటా వీరు దాదాపు రూ. 2800 కోట్ల వ్యాపారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజలంతా స్వదేశీ వస్తువులను కొనడం వల్ల.. రాబోయే ఐదేళ్లలో నిజంగానే ఆత్మ నిర్భర్ భారత్ అవుతుందంటూ.. అమిత్ షా తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

కాగా, షా తీసుకున్న నిర్ణయంతో ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ క్యాంటీన్లలో స్వదేశీ ఉత్పత్తులను అమ్మాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.