యూపీ బీజేపీకి భారీ షాక్.. హస్తం గూటికి చేరిన ఎంపీ

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. బహ్రైచ్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:59 am, Sun, 3 March 19
యూపీ బీజేపీకి భారీ షాక్.. హస్తం గూటికి చేరిన ఎంపీ

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీకి భారీ షాక్ తగిలింది. బహ్రైచ్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె గతంలోనే కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాషాయం పార్టీపై చాలా సార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఆమెతో పాటు సమాజ్‌వాదీ పార్టీ నేత రాకేశ్‌ కూడా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. గతేడాది బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా ఆమెకు సాన్నిహిత్యం ఉంది. 2000 సంవత్సరంలో బీజేపీలో చేరిన‌ పూలే 2002, 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆమె 2014 సాధారణ ఎన్నికల్లో బహ్రైచ్‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు.