గాజువాక ఆటోనగర్ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అదృష్టవశాత్తూ 9 మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అరబిందో ఫార్మాకు చెందిన బస్సు.. ఉద్యోగులతో కలిసి వెళ్తుండగా.. లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ చెరో వైపు అదుపుతప్పి డివైడర్లపైకి ఎక్కాయి. లారీ డ్రైవర్ సహా. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు […]

గాజువాక ఆటోనగర్ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 22, 2020 | 3:11 PM

విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు బస్సును లారీ ఢీకొన్న ఘటనలో అదృష్టవశాత్తూ 9 మంది స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అరబిందో ఫార్మాకు చెందిన బస్సు.. ఉద్యోగులతో కలిసి వెళ్తుండగా.. లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ చెరో వైపు అదుపుతప్పి డివైడర్లపైకి ఎక్కాయి. లారీ డ్రైవర్ సహా. బస్సులో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.