రంజాన్ వార్నింగ్.. నమాజ్‌లో సామాజిక దూరం కంపల్సరీ

రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు (నమాజ్‌లు) వద్దని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది.

రంజాన్ వార్నింగ్.. నమాజ్‌లో సామాజిక దూరం కంపల్సరీ
Follow us

|

Updated on: Apr 16, 2020 | 7:42 PM

రంజాన్ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు (నమాజ్‌లు) వద్దని హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలంటే రంజాన్ ప్రార్థనల్లోను సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించింది. ఈ మేరకు దేశంలోని అన్ని వక్ఫ్ బోర్డులు పరిస్థితిలో తీవ్రతను, ప్రజారోగ్యాన్ని, ముస్లింల ప్రాణాలను దృష్టిలో వుంచుకుని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ వక్ఫ్ బోర్డులకు వివరించింది. అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించింది కేంద్రం. ఇందులో తీసుకున్న నిర్ణయాలను వెలువరించారు అధికారులు.

రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని వక్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 24 తర్వాత దేశంలో సామూహిక ప్రార్థనలు వద్దని, అది కేవలం ముస్లింలకు మాత్రమే కాకుండా హిందూ దేవాలయాలు, క్రిస్టియన్ చర్చిలతోపాటు ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. గత 22 రోజులుగా ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇళ్ళు, బిల్డింగుల మీద సామూహిక ప్రార్థనలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. ఇది కేవలం వారి ప్రాణాలకే కాకుండా వారి కుటుంబీకులకు, సన్నిహితులకు ప్రమాదమని చాలా మంది గుర్తించడం లేదు. ఈ నేపథ్యంలోనే త్వరలో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది.

ఇంకో ఆరేడు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనల కోసం దేశవ్యాప్తంగా మసీదుల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, కరోనా ప్రభావం ఇంకా తగ్గని నేపథ్యంలో ప్రార్థనల్లో (నమాజ్) నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించాలని వక్ఫ్ బోర్డులకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని సూచించింది. హెల్త్ వర్కర్లు, డాక్టర్లు పోలీసులకు సహకరించాలని కోరింది. ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని, 7 లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని పిలుపినిచ్చింది. భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందాలని ప్రార్థనలు చేయాలని ప్రభుత్వం ముస్లింలను కోరింది.

Read: నల్గొండ రైతుల కోసం అక్కడ 24 గంటలూ మార్కెట్.. వాహ్ కిషన్‌ జీ