నేడు తిరుపతికి రాహుల్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తిరుపతికి రానున్నారు. అక్కడ నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర’ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంటకు రానున్న రాహుల్.. ఆ తరువాత అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటల తరువాత శ్రీవారిని దర్శించుకొని తిరిగి తిరుపతికి చేరుకుంటున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ కూడలికి చేరుకొని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి […]

నేడు తిరుపతికి రాహుల్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:55 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తిరుపతికి రానున్నారు. అక్కడ నిర్వహించనున్న ‘ఏపీ ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర’ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రేణిగుంటకు రానున్న రాహుల్.. ఆ తరువాత అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3గంటల తరువాత శ్రీవారిని దర్శించుకొని తిరిగి తిరుపతికి చేరుకుంటున్నారు. సాయంత్రం 4.30 గంటలకు తిరుపతి బాలాజీ కాలనీ కూడలికి చేరుకొని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డితో కలిసి భరోసా బస్సు యాత్రలో తారకరామ మైదానానికి చేరుకోనున్న రాహుల్.. సాయంత్రం 5గంటలకు సభలో ప్రసంగించనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.