AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిగ్ బ్రేకింగ్ న్యూస్: దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్.!

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. కాగా.. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్: దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్.!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 06, 2019 | 5:11 PM

Share

దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.

కాగా.. ఇదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం అధికారికంగా వెల్లడించారు పోలీసులు. గత రాత్రి సీన్ రీ కన్‌స్ట్రేషన్ చేస్తుండగా.. నలుగురూ తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. పోలీసుల వద్ద ఆయుధాలు తీసుకుని.. దాడి చేయబోతుండగా.. పోలీసులు ఆత్మరక్షణ కోసం.. వారిపై కాల్పులు జరపక తప్పలేదని.. నలుగురు నిందితులు అక్కడికక్కడే చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. చటాన్ పల్లి బ్రిడ్జ్ సమీపంలో ఈ ఎన్‌ కౌంటర్ జరిగింది. తెల్లవారు జామున 3 నుంచి 5.30 గంటల ప్రాంతంలో ఎన్‌ కౌంటర్ జరిగినట్టు సమాచారం.

హైదరాబాద్‌‌లో జరిగిన వెటర్నరీ డాక్టర్ ‘దిశ’ హత్యాచారం కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. అంత్యంత కిరాతకంగా.. ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసిన వైనం… మనసున్న ప్రతీ మానవుడిని కలిచివేసింది. ఈ హత్యపై అటు రాజకీయ నాయకులు.. ఇటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు. అంతేకాకుండా.. గత కొద్ది రోజులుగా.. ఈ నలుగురు నిందితులను ఉరి తీయాలని.. ప్రజలందరూ పెద్ద ఎత్తున.. నిరసనలు, ర్యాలీలు చేశారు.

అయితే.. అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా.. సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉండగా.. యాసిడ్ అటాక్ నిందితుల్ని కూడా ఎన్‌కౌంటర్ చేశారు.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?