రాజుకుంటున్న నరసాపురం రాజకీయం
నరసాపురం నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య సొంత కుంపటిలోనే రాజకీయాలు వేడెక్కుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒకరిపై ఒకరు పరస్పర బహిరంగ విమర్శలకు చేసుకుంటున్నారు. ఏకంగా పోలీసు స్టేషన్ కు ఎక్కి కేసులు పెట్టుకుంటున్నారు.
నరసాపురం నియోజకవర్గంలోని వైసీపీ నేతల మధ్య సొంత కుంపటిలోనే రాజకీయాలు వేడెక్కుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒకరిపై ఒకరు పరస్పర బహిరంగ విమర్శలకు చేసుకుంటున్నారు. ఏకంగా పోలీసు స్టేషన్ కు ఎక్కి కేసులు పెట్టుకుంటున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఇప్పటికే ఆయనపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. రఘురామ కృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు చేశారు. తణుకు, భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. కాగా.. ఫిర్యాదు స్వీకరించినా పోలీసు అధికారులు మాత్రం ఇప్పటి వరకూ కేసు నమోదు చేయలేదు. లీగల్ ఒపినియన్ తీసుకున్న తరువాతే కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.