హామీలు నెరవేర్చలేదని మేయర్‌కు శాస్తి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మెక్సికోలోని ఓ నగర మేయర్‌‌ను అక్కడి ప్రజలు దారుణంగా అవమానించారు. బలవంతంగా ఆడవారి దుస్తులు తొడిగి వీధుల్లో ఊరేగించారు. తరువాత సదరు మేయర్ చేత భిక్షాటన చేయించారు. దక్షిణ మెక్సికోలోని హుయిటాన్ అనే ప్రావిన్స్‌కు జెమినెజ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన నగర వీధుల్లో తిరిగి ప్రజలకు హామీలు గుప్పించారు. తాను అధికారంలోకి రాగానే ముందుగా నీటి సరఫరా వ్యవస్థను పునరుద్దరించేందుకు 30 లక్షలు విడుదల చేయిస్తానని హామీ […]

హామీలు నెరవేర్చలేదని మేయర్‌కు శాస్తి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 05, 2019 | 6:30 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మెక్సికోలోని ఓ నగర మేయర్‌‌ను అక్కడి ప్రజలు దారుణంగా అవమానించారు. బలవంతంగా ఆడవారి దుస్తులు తొడిగి వీధుల్లో ఊరేగించారు. తరువాత సదరు మేయర్ చేత భిక్షాటన చేయించారు. దక్షిణ మెక్సికోలోని హుయిటాన్ అనే ప్రావిన్స్‌కు జెమినెజ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికల సమయంలో ఆయన నగర వీధుల్లో తిరిగి ప్రజలకు హామీలు గుప్పించారు. తాను అధికారంలోకి రాగానే ముందుగా నీటి సరఫరా వ్యవస్థను పునరుద్దరించేందుకు 30 లక్షలు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. దీంతో ప్రజలు జేవియర్‌ను భారీ మెజారిటీతో గెలిపించారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే మేయర్ అసలు బుద్ది బయటపడింది. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి.. అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ తీరు పట్ల విసిగిపోయిన ప్రజలు అతడికి స్త్రీ దుస్తులు తొడిగి వీధుల్లో ఊరేగించారు. అయితే మేయర్ మాత్రం తనకు అన్యాయంగా శిక్ష పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేయగలిగినంతా చేశానని వాపోయారు.