AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీసు నిర్బంధంలో పవన్ కల్యాణ్

రాజధాని ఏరియా పర్యటించాలని పవన్ కల్యాణ్… ఎలాగైనా అడ్డుకోవాలనుకుంటున్న పోలీసులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ పీఏసీ సమావేశం తర్వాత రాజధాని ఏరియాలోని గ్రామాలకు పవన్ వెళతారన్న సమాచారంతో జనసేన పార్టీ ఆఫీసు దగ్గర భారీ బలగాలను మొహరించారు. దానికి జనసేన శ్రేణులు అభ్యంతరపెట్టాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాపిటల్ ఏరియా ప్రజలను కలుసుకునేందుకు […]

పోలీసు నిర్బంధంలో పవన్ కల్యాణ్
Rajesh Sharma
|

Updated on: Jan 20, 2020 | 6:27 PM

Share

రాజధాని ఏరియా పర్యటించాలని పవన్ కల్యాణ్… ఎలాగైనా అడ్డుకోవాలనుకుంటున్న పోలీసులతో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పార్టీ పీఏసీ సమావేశం తర్వాత రాజధాని ఏరియాలోని గ్రామాలకు పవన్ వెళతారన్న సమాచారంతో జనసేన పార్టీ ఆఫీసు దగ్గర భారీ బలగాలను మొహరించారు. దానికి జనసేన శ్రేణులు అభ్యంతరపెట్టాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యాపిటల్ ఏరియా ప్రజలను కలుసుకునేందుకు నడుం బిగించారు. సోమవారం ఉదయం నుంచి మూడు రాజధానుల ఏర్పాటుపై శరవేగంగా పరిణామాలు కొనసాగిన నేపథ్యంలో పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు.

తన ఆదేశాలను ఖాతరు చేయని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు విషయమై పీఏసీలో చర్చించారు. ఈలోగా రాజధాని ఏరియాలో ప్రజా ఉద్యమం పెల్లుబుకుతున్న విషయం తెలియడంతో… పీఏసీ సమావేశం తర్వాత రాజధాని ఏరియాలో పర్యటనకు వెళ్ళాలని పవన్ కల్యాణ్ భావించారు. ఇంటెలిజెన్స్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు.. జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ భారీ పోలీసు బలగాలను మొహరించారు. పవన్ కల్యాణ్ కార్యాలయం దాటి బయటికి వెళ్ళే పరిస్థితి లేకుండా చేశారు.

పవన్ కల్యాణ్ పార్టీ కార్యాలయం నుంచి బయటికి వస్తే.. అదుపులోకి తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు. దాంతో పవన్ కల్యాణ్ పార్టీ సీనియర్లతో సమావేశాన్ని కంటిన్యూ చేశారు. పార్టీ కార్యాలయం చుట్టూ పోలీసులను మొహరించడంతో జనసేన పార్టీ వర్గాలు అభ్యంతరం పెట్టాయి. ఇద్దరు డీఎస్పీలతోపాటు సిఐ, ఎస్.ఐ. ఇతర సిబ్బంది రావడంతో జనసేన ఆఫీసు దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.

అయితే.. తనను పోలీసులు బయటికి రానివ్వరని అర్థమైన పవన్ కల్యాణ్ సోమవారం రాత్రి 8 గంటలకు మీడియాతో మాట్లాడాలని తలపెట్టారు. ఈ మేరకు మీడియా కార్యాలయాలకు సమాచారమందించారు. అంతకు ముందు జరిగిన జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో రాజధాని మార్పు, అమరావతిగా రాజధాని కొనసాగింపునకు పోరాట కార్యాచరణ వంటి అంశాలపై ప్రధాన చర్చించారు. రాత్రి ఎనిమిదిగంటలకు జరిగే మీడియా సమావేశంలో జనసేన ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు పవన్ కల్యాణ్ సిద్దమవుతున్నారు.