చంద్రబాబు 420.. కొడాలి నాని సరికొత్త డెఫినేషన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ మంత్రి కొడాలి నాని 420గా సంబోధించారు. అయితే.. ఆ 420 ఐపీసీలోని సెక్షన్ ప్రకారం మోసగాడనే అర్థంలో కాదు. 420 అంటే ఏంటో నాని వివరించారు. అది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా నాని తన సరికొత్త నిర్వచనాన్ని వివరించి.. సభలో నవ్వులు పూయించారు. విపక్షంలో ఆగ్రహానికి కారకులయ్యారు. చంద్రబాబు రాజకీయ రంగంలోకి వచ్చి 4 దశాబ్దాలు దాటింది. అందుకే ఆయన్నందరు ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వుంటారు. […]

  • Rajesh Sharma
  • Publish Date - 5:07 pm, Mon, 20 January 20
చంద్రబాబు 420.. కొడాలి నాని సరికొత్త డెఫినేషన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఏపీ మంత్రి కొడాలి నాని 420గా సంబోధించారు. అయితే.. ఆ 420 ఐపీసీలోని సెక్షన్ ప్రకారం మోసగాడనే అర్థంలో కాదు. 420 అంటే ఏంటో నాని వివరించారు. అది కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా నాని తన సరికొత్త నిర్వచనాన్ని వివరించి.. సభలో నవ్వులు పూయించారు. విపక్షంలో ఆగ్రహానికి కారకులయ్యారు.

చంద్రబాబు రాజకీయ రంగంలోకి వచ్చి 4 దశాబ్దాలు దాటింది. అందుకే ఆయన్నందరు ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ వుంటారు. ఫోర్టీ ఇయర్స్ ఇండస్ట్రీని అత్యంత ఫన్నీగా వివరించిన కొడాలి నాని… దానికి చంద్రబాబు గతంలో ప్రవచించిన 2020 సిద్దాంతాన్ని, ఇప్పుడు చంద్రబాబు దగ్గరున్న ఎమ్మెల్యేల నెంబర్ అయిన 20ని కలపి తనదైన శైలిలో వివరించారు నాని. చంద్రబాబు 2000లో తాను ఉమ్మడి రాష్ట్ర సీఎంగా వున్నప్పుడు 2020 విజన్‌ గురించి తరచూ మాట్లాడేవారు. ఇప్పుడు కూడా తన 2020 విజన్ వల్లే హైదరాబాద్‌తో పాటు.. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాలు అభివృద్ధి చెందాయని చెబుతూ వుంటారు.

ఇక ఆర్నెల్ల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అందులో వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ రావు… అనధికారికంగా వైసీపీతో జతకట్టారు. దాంతో టీడీపీకి మిగిలింది చంద్రబాబు మినహాయించి… ఇరవై మంది. నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన (4) చంద్రబాబుకు ప్రస్తుతం ఇరవై (20) మంది ఎమ్మెల్యేలు మిగిలారంటూ కొడాలి నాని చంద్రబాబునుద్దేశించి 420 అని వ్యాఖ్యానించారు. విజన్ 2020 అన్న చంద్రబాబు ఇప్పుడు 420గా మిగిలారంటూ ఆయన ఇచ్చిన వివరణ శాసనసభలోని వైసీపీ వర్గాల్లో నవ్వులు పూయించగా.. టీడీపీ సభ్యుల్లో ఆగ్రహానికి దారి తీశాయి.