Oxygen Plants: దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు.. వీలైనంత త్వరగా ఏర్పాటు కావాలి: ప్రధాని మోదీ
రోజురోజుకీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో అవసరమైన పేషంట్లకు ఇవ్వడానికి మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
Oxygen in Hospitals: దేశంలో సెకండ్ కోవిడ్ వేవ్ విజృంభణతో ఆక్సిజన్ కొరత అల్లాడుతోంది. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రాణ వాయువు గగనమైంది. రోజురోజుకీ కరోనా వ్యాప్తి పెరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాల్లో అవసరమైన పేషంట్లకు ఇవ్వడానికి మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇండియా విదేశాల నుంచి ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 551 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజారోగ్య సౌకర్యాల కోసం 551 మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇందుకు కోసం పీఎం-కేర్స్ నిధుల నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ప్లాంట్ల ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆసుపత్రులకు ఆక్సిజన్ లభ్యతను పెంచే ప్రధానమంత్రి ఆదేశానికి అనుగుణంగా, దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ ప్లాంట్ల ఏర్పాటు పూర్తికావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించడం కోసమే క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రత్యేక ప్లాంట్లు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలోని జిల్లా ప్రధాన కార్యాలయంలో గుర్తించబడిన ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ఫ్లాంట్లను ఏర్పాట చేయనున్నారు. ఇవీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తారని పీఎంవో వెల్లడించింది. ఇందులో భాగంగానే పీఎం కేర్స్ ఫండ్ ద్వారా ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని ప్రజారోగ్యం దృష్ట్యా అదనంగా 162 మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ .201.58 కోట్లు కేటాయించింది
కాగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో పిఎస్‌ఎ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను స్థాపించడం ద్వారా ప్రాథమిక లక్ష్యం ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమని పీఎంవో పేర్కొంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు ఆక్సిజన్ సరఫరాకు అకస్మాత్తుగా అంతరాయం కలగకుండా చూసుకోవటానికి, కోవిడ్ రోగులతో పాటు అవసరమయ్యే ఇతర రోగులకు ఈ ఆక్సిజన్ ఫ్లాంట్ల ద్వారా ప్రాణ వాయువును అందించనున్నారు.
Read Also… Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ గడువు పెంపు.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్