Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ గడువు పెంపు.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్

Lockdown extended in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో

Delhi Lockdown: దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ గడువు పెంపు.. సంచలన ప్రకటన చేసిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 25, 2021 | 12:40 PM

Lockdown extended in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కరోనాకేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం వారం నుంచి లాక్‌డౌన్‌ను విధించి చర్యలు తీసుకుంటోంది. కాగా ఈ లాక్‌డౌన్ రేపు ఉదయంతో ముగియనుండటంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో మరో వారంపాటు లాక్‌డౌన్‌ గడువును పెంచనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. వచ్చే సోమవారం వరకు లాక్‌డౌన్‌ను పెంచనున్నట్లు కేజ్రీవాల్ ఆదివారం వెల్లడించారు.

అంతకుముందు ఆరు రోజుల లాక్‌డౌన్ మాత్రమే విధించామని.. కేసులు పెరుగుతున్న దృష్ట్యా గడువును పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో.. సరఫరా కోసం.. తయారీదారులు, సరఫరాదారులు, ఆసుపత్రులతో నిరంతరం సంప్రదిస్తున్నామని తెలిపారు. రెండు గంటలకొకసారి సమాచారం తెలిసేలా.. పోర్టల్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర అధికార బృందాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులతోపాటు.. మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో నాలుగురోజుల నుంచి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ అందకపోవడంతో… మూడు రోజుల నుంచి దాదాపు 50 మంది రోగులు మరణించారు. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై.. ఆసుపత్రులకు ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నాయి.

Also Read:

Medical Oxygen: ఢిల్లీలో ప్రాణ వాయువు కోసం ఎదురుచూపులు.. మరోసారి సర్ గంగారామ్‌ హాస్పిటల్‌లో తగ్గిన ఆక్సిజన్‌ నిల్వలు

COVID-19 Care: కరోనా విజృంభణ.. ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు.. మోహరిస్తున్న రైల్వేశాఖ

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..