డెలివరీకీ ఎనిమిదేళ్లు..అంతా ఆన్‌లైన్‌ మాయ

ఆన్‌లైన్‌లో ఇలా బుక్‌ చేస్తే.. అలా మన ఇంటి డోర్ ముందు వాలిపోతుంది. కొన్ని డెలివరీ సంస్థలు 24 గంటల సమయం తీసుకుంటే కొన్ని గంటల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే టొరంటోకు చెందిన ఓ డాక్టర్‌‌కు విచిత్రమై పరిస్థితి ఎదురైంది. ఓ రోజు ఉదయం నిద్రలేచి తలుపు తెరిచేసరికి డోర్ మందు  పార్శిల్ కనిపించింది. ఎవరిదా అని బాక్స్ చూస్తే ఊరు, పేరు, ఫోన్‌ నెంబర్‌ అన్ని తనవే… కొద్దిసేపు బిత్తరపోయిన డాక్టర్‌ గారికి మరో షాక్… […]

డెలివరీకీ ఎనిమిదేళ్లు..అంతా ఆన్‌లైన్‌ మాయ

ఆన్‌లైన్‌లో ఇలా బుక్‌ చేస్తే.. అలా మన ఇంటి డోర్ ముందు వాలిపోతుంది. కొన్ని డెలివరీ సంస్థలు 24 గంటల సమయం తీసుకుంటే కొన్ని గంటల్లోనే డెలివరీ చేస్తున్నాయి. అయితే టొరంటోకు చెందిన ఓ డాక్టర్‌‌కు విచిత్రమై పరిస్థితి ఎదురైంది. ఓ రోజు ఉదయం నిద్రలేచి తలుపు తెరిచేసరికి డోర్ మందు  పార్శిల్ కనిపించింది. ఎవరిదా అని బాక్స్ చూస్తే ఊరు, పేరు, ఫోన్‌ నెంబర్‌ అన్ని తనవే… కొద్దిసేపు బిత్తరపోయిన డాక్టర్‌ గారికి మరో షాక్… ఈ ఆర్డర్‌ ఇప్పటిది కాదు. సరిగ్గా.. ఎనిమిదేండ్ల క్రితంది. అని చూసిన తర్వాత మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు.

2012లో డాక్టర్‌ ఎల్లియాట్‌ బెరిన్‌స్టేయిన్‌ ఓ ఆన్‌లైన్ సంస్థ ద్వారా ఓ హెయిర్‌ క్రీమ్‌ను ఆర్డర్‌ చేశాడు. దీంతో ఆ సంస్థ కెనడా పోస్టు ద్వారా ప్రొడక్ట్‌ను పంపింది. అయితే, కెనడా పోస్టు దాన్ని వెంటనే అతనికి డెలివరీ చేయలేదు. ఏ సమస్య వచ్చిందో ఏమో వారి వద్దే నిలిచిపోయింది. ఆ పార్శల్‌ను ఇంతకాలానికి డెలివరీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడ మరో వండర్ ఏంటంటే… హెయిర్‌ క్రీమ్‌ తెలుపు రంగులో ఉండాలి. కానీ ఇక్స్‌పైరీ అయిపోవడంతో పసుపు రంగులోకి మారింది. డాక్టర్‌గారి చిర్రెత్తుకొచ్చింది. ఇదేంటిది.. ఇంతకాలానికి ఎందుకు పంపారు అని మెయిల్ చేస్తే… ఆ డెలివరీ సంస్థ చాలా సింపుల్‌గా ఓ “సారీ” చెప్పేసింది.