బ్రేకింగ్: జగన్‌కు ఫోన్ చేసిన అమిత్‌షా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. దేశంలో మరో రెండు రోజుల్లో నాలుగో విడత లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో....

Amithshah called AP CM YS Jagan on friday: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. దేశంలో మరో రెండు రోజుల్లో నాలుగో విడత లాక్ డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఏపీ ముఖ్యమంత్రికి కాల్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు పది నిమిషాలు సాగిన వీరిద్దరి ఫోన్ కాల్ సంభాషణలో పలు అంశాలు చర్చకొచ్చినట్లు ఏపీ సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా ప్రభావంతో దేశంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో అయిదో విడతలోకి మారబోతోంది. ఒకవైపు కొన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు విపరీతమైన వేగంతో పెరుగుతుంటే కొన్ని రాష్ట్రాలలో కరోనా ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దేశం మొత్తానికి ఒకేరకంగా లాక్ డౌన్ విధివిధానాలను అమలు చేయడం కేంద్రానికి సవాలుగా మారింది. రాష్ట్రానికో రకంగా విధివిధానాలను రూపొందించడం కేంద్రానికి కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలు, విషయాలలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును నాలుగో విడతలోనే కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది.
ఈ నేపథ్యంలో అయిదో విడతలో కేంద్రం మరిన్ని మినహాయింపులను ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలలోని పరిస్థితులను తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం దేశంలోని పలు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన అమిత్‌షా.. శుక్రవారం దానికి కొనసాగింపుగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కాల్ చేసినట్లు సమాచారం. కోవిడ్ – నివారణా చర్యలు, లాక్‌డౌన్‌పై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోం మంత్రికి సీఎం జగన్ వివరించారు.