ఈడీ కార్యాలయాన్ని తాకిన కరోనా..!

ప్రపంచంలో కరోనా వైరస్ ఎవరిని వదలడంలేదు. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లో జూనియర్ ర్యాంక్ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పనిచేసే డివిజన్ క్లర్క్ చివరిసారి మే 18న ఆఫీసుకు వచ్చారని, అతని శాంపిల్స్ టెస్టుకు పంపించగా పాజిటివ్ గా తేలిందన్నారు. ఆయన కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ నుంచి ఈడీకి డిప్యుటేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని కాంటాక్ట్స్ […]

ఈడీ కార్యాలయాన్ని తాకిన కరోనా..!

ప్రపంచంలో కరోనా వైరస్ ఎవరిని వదలడంలేదు. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లో జూనియర్ ర్యాంక్ అధికారి ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పనిచేసే డివిజన్ క్లర్క్ చివరిసారి మే 18న ఆఫీసుకు వచ్చారని, అతని శాంపిల్స్ టెస్టుకు పంపించగా పాజిటివ్ గా తేలిందన్నారు. ఆయన కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ నుంచి ఈడీకి డిప్యుటేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించామని కాంటాక్ట్స్ ట్రేస్ చేస్తున్నామని చెప్పారు. ఆఫీస్ లో కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్నామని, వారానికి రెండు సార్లు శానిటైజ్ చేసి షిఫ్టులవారీగా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు విధుల నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.