కరోనా లాక్‌డౌన్: భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం

కరోనా లాక్‌డౌన్: భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు..!
Follow us

| Edited By:

Updated on: May 29, 2020 | 4:53 PM

Elective surgeries in India held: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది.

వివరాల్లోకెళితే.. నేటి వరకు కూడా దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గక పోవడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థలు అత్యవసరం కాని సర్జరీ కేసులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి. మే 31వ తేదీ నాటికి నాలుగవ దశ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. లాక్‌డౌన్‌ను పొడిగించినా, లేకపోయిన వాయిదా వేస్తూ వస్తోన్న సర్జరీలను వెంటనే అనుమతించక పోయినట్లయితే వారిలో ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

కాగా.. మార్చి 20 తరువాత భారత్ లో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్‌ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎలక్టివ్‌ సర్జరీలంటే అత్యవసరం కాకపోయినప్పటికీ సర్జరీ ద్వారా ప్రాణాలను కాపాడాల్సిన కేసులే. ఈ సర్జరీలను ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, రోగుల పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ఎప్పుడు సర్జరీ చేయాలో ముందుగానే నిర్ధారిస్తారు. వాటి కోవలోకి హెర్నియా, అపెండిక్స్, కిడ్నీ, గాల్‌ బ్లాడర్‌ సర్జరీలను వాయిదా వేయవచ్చు. అయితే మరింత ఆలస్యమైతే రోగుల పరిస్థితి దుర్భరం అవుతుంది.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..

Latest Articles