AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మర్కజ్ చీఫ్ కు అక్రమ మార్గంలో నిధులు: సీబీఐ విచారణ

నిజాముద్దీన్‌లో తబ్లీగ్‌ జమాత్‌ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్‌ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేసింది.

మర్కజ్ చీఫ్ కు అక్రమ మార్గంలో నిధులు: సీబీఐ విచారణ
Jyothi Gadda
|

Updated on: May 29, 2020 | 5:10 PM

Share

తబ్లీగ్‌ జమాత్‌ చీఫ్‌, నిజాముద్దీన్‌ మర్కజ్‌కు చెందిన మౌలానా సాద్‌కు హవాలా మార్గంలో విదేశాల నుంచి వచ్చిన విరాళాలపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దర్యాప్తు కొనసాగిస్తోంది. నిజాముద్దీన్‌లో తబ్లీగ్‌ జమాత్‌ సమావేశం నిర్వహించి కరోనా వ్యాప్తికి కారణమైన మౌలానా సాద్‌ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనంతరం హవాలా మార్గంలో మౌలానాకు విదేశాల నుంచి విరాళాలు వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు చేసింది. దీంతో తాజాగా రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు, ఈడీ, ఐటీ విభాగాల నుంచి మౌలానాకు అందిన విదేశీ విరాళాలపై సమాచారాన్ని సేకరించారు.

తబ్లీగ్‌ జమాత్‌ విదేశీ విరాళాల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న మౌలానా సన్నిహితుడైన ముర్సలీన్‌ను మే 16న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారించారు. జమాత్‌ ట్రస్టుకు విదేశీ విరాళాలు హవాలా మార్గంలో స్వీకరించి మనీలాండరింగ్‌ కు పాల్పడ్డారని ఈడీ దర్యాప్తులో తేలడంతో సీబీఐ రంగంలోకి దిగి మౌలానా సాద్‌ పై దర్యాప్తు సాగిస్తోంది. మర్కజ్‌ ట్రస్ట్‌తోపాటు మౌలానా సాద్‌పై సీబీఐ చర్యలు తీసుకోనుంది. అంతకుముందు మర్కజ్‌ విరాళాలపై కీలక పత్రాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే, మార్చి 13 తరువాత మర్కజ్‌ లోపల ఉన్న వేలాది మంది భారతీయులను, విదేశీయులను దేశవ్యాప్తంగా లాకడౌన్‌ను ధిక్కరించడానికి మౌలానా సాద్‌ ప్రోత్సహించారని ఆరోపణలున్నాయి. కోవిడ్‌ -19 పాజిటివ్‌ వచ్చిన 4,300 మంది వ్యక్తులు మర్కజ్‌లో జరిగిన కార్యక్రమానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారని కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే