స్పెయిన్ బుల్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్

స్పెయిన్ బుల్ రఫెల్ నాదెల్ మరోసంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్  సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జోకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సొంతం చేసుకున్నాడు...

స్పెయిన్ బుల్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్
Follow us

|

Updated on: Oct 12, 2020 | 5:27 AM

Nadal beats Djokovic :స్పెయిన్ బుల్ రఫెల్ నాదెల్ మరోసంచలనాన్ని క్రియేట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ మెన్స్  సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జోకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయం సాధించి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్ సొంతం చేసుకున్నాడు. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదెల్.. రెండో సెట్‌లోనూ జకోవిచ్‌కు అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు.

హోరాహోరీగా సాగుతుందని అంచనావేసినవారికి మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మూడో సెట్‌లోనూ తన సత్తా చాటి చూపించి టైటిట్ ను కైవసం చేసుకున్నాడు. మొత్తంగా ఈ టోర్నీలో నాదల్ చేతిలో జకోవిచ్‌ మూడుసార్లు ఓడిపోయాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్ 2020 విజయంతో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ సరసన నిలిచాడు స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్.

ఎర్రమట్టి కోర్టులో తనకు తిరిగులేదని మరోసారి రఫెల్‌ నాదెల్ నిరూపించుకున్నాడు. తొలిసెట్‌లో 6-0 పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్…  రెండో సెట్‌లోనూ 6-2తో జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో 7-5తో పైచేయి సాధించి టైటిల్‌ సాధించాడు.