AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖలో కుండపోత.. గోడకూలి వ్యక్తి మృతి

ఉక్కునగరం విశాఖ కుండపోత వర్షంతో ఉక్కిరిబిక్కిరైంది. ఎడతెరిపిలేకుండా రాత్రంతా కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బ౦గాళాఖాత౦లో కొనసాగుతోన్న వాయుగు౦డ౦ కారణంగా ఆదివారం నుండి విశాఖలో వాతావరణం మారిపోయింది. ఆదివారం ఉదయం నుండి సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీయగా…. రాత్రి 8 గ౦టల నుండి నగరంలో దాదాపు రెండు గ౦టల పాటు భారీ వర్షం నమోదై౦ది.అన౦తర౦ కూడా ఓ మోస్తరు […]

విశాఖలో కుండపోత.. గోడకూలి వ్యక్తి మృతి
Venkata Narayana
|

Updated on: Oct 12, 2020 | 6:36 AM

Share

ఉక్కునగరం విశాఖ కుండపోత వర్షంతో ఉక్కిరిబిక్కిరైంది. ఎడతెరిపిలేకుండా రాత్రంతా కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికులు వచ్చి రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. బ౦గాళాఖాత౦లో కొనసాగుతోన్న వాయుగు౦డ౦ కారణంగా ఆదివారం నుండి విశాఖలో వాతావరణం మారిపోయింది. ఆదివారం ఉదయం నుండి సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీయగా…. రాత్రి 8 గ౦టల నుండి నగరంలో దాదాపు రెండు గ౦టల పాటు భారీ వర్షం నమోదై౦ది.అన౦తర౦ కూడా ఓ మోస్తరు వర్షం అర్దరాత్రి వరకూ పడుతూనే ఉంది. భారీ వర్షానికి నగరం లోని పాత గాజువాక జ౦క్షన్ వద్ద రోడ్డు పై మోకాలు లోతు నీరు నిలిచిపోయి౦ది. దీ౦తో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని మిగిలిన చోట్ల కూడా భారీ వర్షానికి రోడ్లు జలమయ౦ అయ్యాయి.