IPL 2020: MI vs DC : హోరాహోరీ పోరులో నెగ్గిన ముంబై

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో టార్గెట్ రోహిత్ సేన చేధించింది.

IPL 2020: MI vs DC : హోరాహోరీ పోరులో నెగ్గిన ముంబై
Follow us

|

Updated on: Oct 11, 2020 | 11:28 PM

అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ ‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల టార్గెట్‌ను 19.4 ఓవర్లలో టార్గెట్ రోహిత్ సేన చేధించింది. ఈ మ్యాచ్‌లో డికాక్ (53, 36 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (53, 32 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇషాన్ కిషన్ (28) కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. రోహిత్ శర్మ (5), హార్దిక్ పాండ్యా( 0 ) తీవ్రంగా నిరాశపరిచారు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఐదో ఓవర్లోనే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్‌ డికాక్‌,‌ సూర్య కుమార్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నారు. అశ్విన్‌ వేసిన 10వ ఓవర్లో డికాక్‌ ఔటైన తర్వాత ముంబై స్కోరు వేగం తగ్గింది. చివర్లో 30 బంతుల్లో 33 పరుగులు రాబట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య..స్టాయినీస్‌ వేసిన తర్వాతి ఓవర్లో కీపర్‌ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. ఆఖర్లో యువ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌(28: 15 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) మంచి ప్రదర్శన చేశాడు. చివరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా కృనాల్‌ పాండ్య(12 నాటౌట్‌) రెండు ఫోర్లు కొట్టి పనిపూర్తి చేశాడు. పొలార్డ్‌(11 నాటౌట్‌) అతనికి సహకరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రబడా 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మార్కస్ స్టోయినస్ తలో వికెట్ దక్కింది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 162 పరుగులు చేసింది. అయితే జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. మొదటి ఓవర్‌లోనే పృథ్వీ షా (4; 3 బంతుల్లో, 1×4)ను బౌల్ట్‌ ఔట్ చేశాడు. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌ ఆడుతున్న రహానె (15) కూడా ఎక్కువ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేశాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ను గాడినపెట్టాడు. మంచి షాట్లు ఆడిన వీరిద్దరు..మూడో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే స్పీడు పెంచే క్రమంలో  కృనాల్ బౌలింగ్‌లో శ్రేయస్ ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4)తో కలిసి ధావన్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఈ క్రమంలో ధావన్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే రెండో పరుగు కోసం ప్రయత్నించిన స్టాయినిస్‌ (13; 8 బంతుల్లో 2×4) రనౌటయ్యాడు. ఆఖర్లో అలెక్స్‌ కేరీ (14; 9 బంతుల్లో), ధావన్‌ స్పీడు పెంచలేకపోయారు. ముంబై బౌలర్లలో కృనాల్ రెండు వికెట్లు తీయగా, బౌల్ట్‌కు‌ ఒక్క వికెట్ దక్కింది. చివరికి విజయం ముంబైను వరించింది.