సంతోష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ – ఎందుకంటే?

తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం రాజ్యసభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. దానికి కారణం ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే. ఎంపీ సంతోష్ హైదరాబాద్ శివార్లలోని కీసర అటవీ ప్రాంతాన్ని దత్తతకు తీసుకుని గ్రీన్ కారిడార్ పేరిట ఎకో టూరిజంతో అడవుల అభివృద్ధికి పాటుపడడమే కాకుండా.. గ్రీన్ ఛాలెంజ్ పేరిట ప్రతీ ఒక్కరు […]

సంతోష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ - ఎందుకంటే?
Follow us
Rajesh Sharma

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 7:08 PM

తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం రాజ్యసభలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. దానికి కారణం ఆయన పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే. ఎంపీ సంతోష్ హైదరాబాద్ శివార్లలోని కీసర అటవీ ప్రాంతాన్ని దత్తతకు తీసుకుని గ్రీన్ కారిడార్ పేరిట ఎకో టూరిజంతో అడవుల అభివృద్ధికి పాటుపడడమే కాకుండా.. గ్రీన్ ఛాలెంజ్ పేరిట ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలన్న క్యాంపెయిన్‌ను టేకప్ చేశారు.

సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌కు పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించారు. అయితే.. ఎంపీ సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్‌ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ దృష్టికి రావడంతో వివరాలు తెలుసుకున్నారు. గ్రీన్ ఛాలెంజ్‌కు పెద్ద ఎత్తున స్పందన రావడంతోపాటు పలువురు సెలబ్రీటీలను పర్యావరణ పరిరక్షణ వైపు కదిలించిన సంతోష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు హరివంశ్ నారాయణ్ సింగ్. సంతోష్ పిలుపు మేరకు టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రీన్ ఛాలెంజ్ కు సంబంధించిన వివరాల బ్రోచర్‌ను బండా ప్రకాశ్.. హరివంశ్ నారాయణ్‌కు అందజేశారు.

ఒక్కరు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటమని పిలుపునివ్వడం గొప్ప పర్యావరణహితకార కార్యక్రమన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని హరివంశ్ పిలుపునిచ్చారు. కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉత్పత్తికి గ్రీన్ ఛాలెంజ్ ఎంతో దోహదపడుతుందన్నారు. సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ పిలుపునకు ఇటీవల వెటరన్ సూపర్ స్టార్ కృష్ణ కూడా స్పందించిన విషయం తెలిసిందే.