AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త మంత్రులకు అభినందనలు-హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెరాసలో […]

కొత్త మంత్రులకు అభినందనలు-హరీష్‌రావు
Ram Naramaneni
|

Updated on: Feb 19, 2019 | 2:31 PM

Share

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అమలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్‌భవన్‌లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నిజం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తెరాసలో తాను సైనికుడిలాంటి క్రమశిక్షణ గల కార్యకర్తనని.. కేసీఆర్‌ ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు పదుల సంఖ్యలో చెప్పానని ఆయన గుర్తు చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణలు దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ కేబినెట్‌ను ఏర్పాటు చేశారన్నారు. సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు హరీశ్‌ చెప్పారు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రచారం కొనసాగిస్తే దాన్ని పట్టించుకోవద్దన్నారు. పార్టీ కోసం కేసీఆర్‌ నాయకత్వంలో అందరూ పనిచేయాలని తెరాస, నేతలు కార్యకర్తలకు ఆయన సూచించారు.

థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు