బ్రేకింగ్: వైసీపీ ఎమ్మెల్యే కారు ధ్వంసం
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న అమరావతి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇపుడు దాన్ని తరలిస్తారా అంటూ రోడ్డెక్కిన రైతాంగం కనిపించిన ప్రతీ ప్రజాప్రతినిధినీ నిలదీస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి దగ్గరలోని హాయ్‌ల్యాండ్ ప్రాంతం మీదుగా మంగళవారం నాడు వెళుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. పిన్నెల్లి కారుపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. సుమారు నాలుగు గంటల పాటు […]
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న అమరావతి రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. వేల ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇపుడు దాన్ని తరలిస్తారా అంటూ రోడ్డెక్కిన రైతాంగం కనిపించిన ప్రతీ ప్రజాప్రతినిధినీ నిలదీస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి దగ్గరలోని హాయ్‌ల్యాండ్ ప్రాంతం మీదుగా మంగళవారం నాడు వెళుతున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారుపై ఆందోళన చేస్తున్న రైతులు దాడికి దిగారు. పిన్నెల్లి కారుపై రాళ్ళు, కర్రలతో దాడి చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించిన రైతులు నినాదాలతో హోరెత్తించారు.
రైతులు గంటల తరబడి ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో వందలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. అదే సమయంలో విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును రైతులు అడ్డుకున్నారు. రాజధాని తరలించబోమంటూ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఎంత సేపటికీ కారు దిగకపోవడంతో కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు రాళ్ళు, కర్రలతో కారుపై దాడి చేశారు. దాంతో కారు ఫ్రంట్ మిర్రర్ పగిలిపోయింది.వెనుక అద్దాలు పగిలిపోయాయి.
పోలీసులు ఎంతగా నిలువరించే ప్రయత్నం చేసినా రైతుల్లో ఆగ్రహాన్ని అదుపుచేయలేకపోయారు. దాంతో గంటల తరబడి ఎమ్మెల్యే వాహనం ఆందోళనకారుల మధ్య ఇరుక్కుపోయి, ముందుకు వెళ్ళలేకపోయింది. పోలీసులు పెద్ద ఎత్తున రంగప్రవేశం చేసి, ఎమ్మెల్యే వాహనాన్ని అక్కడ్నించి తరలించారు.
మరోరవైపు చినకాకాని ప్రాంతం కూడా రణరంగంగా మారుతోంది. దాంతో జిల్ల్లా కేంద్రం నుంచి అదనపు బలగాల తరలిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయానికి భద్రత పెంచారు పోలీసులు. ఎమ్మెల్యే కార్యాలయం కొద్దిదూరంలో ఆందోళకారులు కాపు కాయడంతో పోలీసులు అప్రమత్తంగా వున్నారు.