మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం

బెజవాడ దుర్గమ్మ రథం మీద చోరీకి గురైన మూడు సింహాలూ ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఇంట్లో ఉన్నాయనటం ఎంతో దారుణమని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. దుర్గమ్మ గుడిలో సింహాలు కనపడకపోవడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమ లాంటి వాళ్ళ మాటలు చూస్తే, చంద్రబాబు ఎలాంటి వారిని శాసనమండలిలో ఉంచారో తెలుస్తుందన్నారు విష్ణు. ఆంజనేయస్వామిని మునిసిపల్ ట్రాక్టర్ లో తరలించిన విషయం […]

  • Venkata Narayana
  • Publish Date - 7:26 pm, Sun, 20 September 20
మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం

బెజవాడ దుర్గమ్మ రథం మీద చోరీకి గురైన మూడు సింహాలూ ఏపీ దేవాదాయ శాఖా మంత్రి ఇంట్లో ఉన్నాయనటం ఎంతో దారుణమని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. దుర్గమ్మ గుడిలో సింహాలు కనపడకపోవడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. బుద్దా వెంకన్న, దేవినేని ఉమ లాంటి వాళ్ళ మాటలు చూస్తే, చంద్రబాబు ఎలాంటి వారిని శాసనమండలిలో ఉంచారో తెలుస్తుందన్నారు విష్ణు. ఆంజనేయస్వామిని మునిసిపల్ ట్రాక్టర్ లో తరలించిన విషయం టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గుర్తులేదా అని ఆయన అన్నారు. బుద్దా వెంకన్న ఇంటి చుట్టూ ఉన్న ఆలయాలు టీడీపీ ప్రభుత్వంలో కూలగొట్టారని.. తిరుమల వెయ్యికాళ్ళ మండపం పడగొట్టింది టీడీపీ ప్రభుత్వం.. చంద్రబాబు. అని ఆయన విమర్శలు గుప్పించారు. గోశాల కట్టిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని తెలిపిన విష్ణు.. విశాఖ శారదాపీఠం స్వామివారిని విమర్శిస్తున్న వారికి బుద్ధి, జ్ఞానం లేవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు మత, కుల రాజకీయాలు చేస్తే సహించమని ఆయన వార్నింగ్ ఇచ్చారు.