మళ్ళీ షురూ: టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేత

టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎత్తేస్తూ మద్రాస్ హైకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. ఏప్రిల్ 24వ తేదీన వాదనలు విన్న మద్రాస్ న్యాయస్థానం.. టిక్ టాక్ యాప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించకుండా కొత్త చర్యలు చేపడతాం అని టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ చెప్పటంతో మద్రాస్ హైకోర్టు […]

మళ్ళీ షురూ: టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేత
Follow us

|

Updated on: Apr 24, 2019 | 7:44 PM

టిక్ టాక్ యాప్ పై నిషేధం ఎత్తేస్తూ మద్రాస్ హైకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. ఈ యాప్ పై పూర్తి విచారణ చేసి.. తుది నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. ఏప్రిల్ 24వ తేదీన వాదనలు విన్న మద్రాస్ న్యాయస్థానం.. టిక్ టాక్ యాప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు చెప్పింది. 13 ఏళ్లలోపు చిన్నారులు యాప్ వినియోగించకుండా కొత్త చర్యలు చేపడతాం అని టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ చెప్పటంతో మద్రాస్ హైకోర్టు ఈ బ్యాన్ ను సడలించింది.

గతంలో టిక్ టాక్ యాప్ పై తీవ్ర విమర్శలు రావడంతో.. మదురైకి చెందిన ముత్తుకుమార్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో మద్రాస్ హైకోర్టు ఏప్రిల్ 3న భారత్‌లో టిక్ టాక్ యాప్‌ డౌన్‌లోడ్‌ను బ్యాన్ చేసింది. కేంద్రం కూడా వెంటనే చర్యలు తీసుకుని ఆండ్రాయిడ్, ఆపిల్ ప్లే స్టోర్స్ నుంచి ఈ అప్ ను తొలిగించింది. కాగా కోర్టు ఆదేశాలపై టిక్ టాక్ రూపకర్త బైటెడెన్స్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.