AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో వైసీపీకి దూరం కానున్న జగన్!

విజయవాడ: బ్రేకింగ్ న్యూస్.. త్వరలో వైసీపీ పార్టీకి జగన్ దూరం కానున్నారట.. ఈ విషయాన్ని వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ చెప్పారు. నిజానికి వైసీపీని స్థాపించింది జగన్ కాదు, కొలిశెట్టి శివకుమార్. వైసీపీ పేరుతో శివకుమార్ రిజిస్టర్ చేయించిన పార్టీని ఆయన అనుమతితో జగన్ తీసుకున్నారు. అనంతరం కలిసి పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివకుమార్‌ను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ఎదురుతిరిగిన ఆయన తాజాగా […]

త్వరలో వైసీపీకి దూరం కానున్న జగన్!
Nikhil
| Edited By: |

Updated on: Oct 18, 2020 | 7:14 PM

Share

విజయవాడ: బ్రేకింగ్ న్యూస్.. త్వరలో వైసీపీ పార్టీకి జగన్ దూరం కానున్నారట.. ఈ విషయాన్ని వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ చెప్పారు. నిజానికి వైసీపీని స్థాపించింది జగన్ కాదు, కొలిశెట్టి శివకుమార్. వైసీపీ పేరుతో శివకుమార్ రిజిస్టర్ చేయించిన పార్టీని ఆయన అనుమతితో జగన్ తీసుకున్నారు. అనంతరం కలిసి పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివకుమార్‌ను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

దీంతో ఎదురుతిరిగిన ఆయన తాజాగా మాట్లాడుతూ జగన్‌‌పై విమర్శలు చేశారు. కేసీఆర్‌తో కలిసి పార్టీని భ్రష్టు పట్టించారని విమర్శించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ప్రశ్నించినందుకే తనను జగన్ సస్పెండ్ చేశారని చెప్పారు. తాను రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో పార్టీని స్థాపించానని, కలిసి పని చేద్దామని చెప్పిన జగన్ తర్వాత తనను దూరం పెట్టారని అన్నారు. అయితే ఇప్పటికీ పార్టీ తన పేరు మీదనే ఉందని, త్వరలో పగ్గాలు చేపడతానని శివకుమార్ చెప్పారు.

కొలిశెట్టి శివకుమార్..

Follow Us