AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. కరోనా కాలం నాటి పెండింగ్ వేతనాల చెల్లించాలని ఆదేశం.. ఉద్యోగ భద్రతపై త్వరలో నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న గుడ్‌న్యూస్‌ని వినిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఆదివారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక శుభవార్తను తానే స్వయంగా వినిపించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. కరోనా కాలం నాటి పెండింగ్ వేతనాల చెల్లించాలని ఆదేశం.. ఉద్యోగ భద్రతపై త్వరలో నిర్ణయం
Rajesh Sharma
|

Updated on: Nov 15, 2020 | 3:51 PM

Share

KCR good news to rtc employees: కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో విధించిన వేతనాల కోతలో 50 శాతం చెల్లించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశాలిచ్చారు. ఉద్యోగుల జీతంలో 2 నెలల పాటు కోత విధించిన 50 శాతం మొత్తాన్ని చెల్లించాలని సీఎం నిర్ణయించారు. దీని వల్ల ఆర్థిక శాఖకు దాదాపు 120 నుంచి 130 కోట్ల రూపాయలు భారం పడుతుందని అంఛనా వేస్తుండగా.. అవసరమైన నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలిచ్చారు.

ఆదివారం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెండు నెలల వేతనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కార్మిక సంఘాల అభ్యర్థనలను కూడా పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి నిలిపేసిన రెండు నెలల జీతాల్లోంచి 50 శాతం వెంటనే చెల్లించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై త్వరలో విధానపర నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. పార్సిల్ సర్వీసుల బిజినెస్ 1 మిలియన్ దాటిన నేపథ్యంలో ఆర్టీసీ అధికారులను అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇకపై హైదరాబాద్ నగరంలో 50 శాతం బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సునీల్ కుమార్‌ను ఆదేశించారు.

ALSO READ: వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు

ALSO READ: వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు