వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు.. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు.. నవంబర్ 23 నుంచి రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణావ్యాప్తంగా నిలిచిపోయిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పున: ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణి వెబ్ పోర్టల్ ద్వారా జోరందుకున్న నేపథ్యంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించాలని ఆయన నిర్దేశించారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ముహూర్తం ఖరారు.. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు.. నవంబర్ 23 నుంచి రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్
Follow us
Rajesh Sharma

|

Updated on: Nov 15, 2020 | 3:14 PM

Non agriculture registrations to commence soon: వ్యవసాయేతర భూముల రిజిష్ర్టేషన్ ప్రక్రియను నవంబర్ 23వ తారీఖు నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే తన చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభమయిన నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్‌ను లాంచ్ చేస్తారని సిఎం కేసీఆర్ తెలిపారు.

ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్ వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….‘‘ ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది. అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నది. భూ రిజిష్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ఆరంభమైనట్టుగా తెలంగాణ ప్రజలు భావిస్తున్నరు. ధరణి ద్వారా వారి వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తిని.. నిశ్చింతను వ్యక్తం చేస్తున్నరు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ అద్భుతంగా వున్నది. ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించింది. మరో మూడు, నాలుగు రోజులలో నూటికి నూరు శాతం అన్ని రకాల సమస్యలను అధిగమించనున్నది. ఎక్కడి సమస్యలు అక్కడ చక్కబడినంకనే వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకున్నం. అందుకే కొన్ని రోజులు వేచి చూసినం. నవంబర్ 23 సోమవారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వ్యవసాయేతర భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియను లాంచ్ చేస్తారు. ధరణి పోర్టల్ అద్భుతంగా తీర్చిదిద్దినందుకు అధికారులను మనస్పూర్తిగా అభినందిస్తున్న ’’ అని సిఎం అన్నారు.

ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్., సిఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు , రెవిన్యూ శాఖ కార్యదర్శి శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సిఎంవో అధికారులు, ఎంఏయుడీ డైరక్టర్ సత్యనారాయణ, పంచాయితీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: వైసీపీలో వర్గపోరు.. టెంపుల్ కోసం తన్నులాట

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ALSO READ: కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు