మ‌ద్యం కిక్కులో అడ్డొచ్చిన పామును కొరికి చంపేశాడు…ఆపై

మ‌ద్యం కిక్కులో అడ్డొచ్చిన పామును కొరికి చంపేశాడు...ఆపై

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్ర‌మంలో వైన్ షాపులు కూడా మూసివేయడంతో మందుబాబుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. 40 రోజులపాటు చుక్క మందు దొర‌క్క‌పోవ‌డంతో..వారి నాలుక‌లు పిడ‌చ‌కట్టుకుపోయాయి. ప్ర‌స్తుతం లాక్ డౌన్ 3.O అమ‌లువుతున్న‌ప్ప‌టికీ కేంద్రం ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో ప‌లు రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి. ఈ క్ర‌మంలో 40 రోజులు త‌ర్వాత లిక్క‌ర్ బాటిల్ అందుకున్న మందుబాబులు ఎవ‌రెస్ట్ […]

Ram Naramaneni

|

May 06, 2020 | 3:54 PM

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో సామాన్యులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే క్ర‌మంలో వైన్ షాపులు కూడా మూసివేయడంతో మందుబాబుల క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. 40 రోజులపాటు చుక్క మందు దొర‌క్క‌పోవ‌డంతో..వారి నాలుక‌లు పిడ‌చ‌కట్టుకుపోయాయి. ప్ర‌స్తుతం లాక్ డౌన్ 3.O అమ‌లువుతున్న‌ప్ప‌టికీ కేంద్రం ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌డంతో ప‌లు రాష్ట్రాల్లో వైన్ షాపులు తెరుచుకున్నాయి.

ఈ క్ర‌మంలో 40 రోజులు త‌ర్వాత లిక్క‌ర్ బాటిల్ అందుకున్న మందుబాబులు ఎవ‌రెస్ట్ ఎక్కినంత అనందంగా ఉన్నారు. క‌డుపునిండా మందు తాగి మ‌త్తులో ఊగి..జోగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపి..కర్నాటక సరిహద్దులో మందు బాబు హంగామా క్రియేట్ చేశాడు. మద్యం మత్తులో పామును కోరికి చంపేశాడు. కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముళబాగిలు తాలూక్ ముష్టూరు గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతుండగా పాము అడ్డం వచ్చిందని దాన్ని పట్టుకుని నోటితో కొరికి చంపేశాడు ఈ ఘనుడు. అంతేకాదు దాన్ని మెడ‌లో చుట్టుకోని బైక్ పై మ‌ద్యం తాగుతూ రోడ్లపై రౌండ్లు వేశాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu