AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలా చేసే ఎన్నికలకు వెళతాం.. సీఎం నోట ఎలెక్షన్ మాటెందుకో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచడం వెనక సీక్రెట్ రివీల్ చేశారు ముఖ్యమంత్రి జగన్. మత్స్యకార భరోసా కింద వారందరికీ గతంలో ఇస్తున్న నాలుగు వేల రూపాయల స్థానంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రకటించిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామంటూ సీఎం సంచలన ప్రకటన చేశారు.

అలా చేసే ఎన్నికలకు వెళతాం.. సీఎం నోట ఎలెక్షన్ మాటెందుకో?
Rajesh Sharma
|

Updated on: May 06, 2020 | 2:24 PM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని గణనీయంగా పెంచడం వెనక సీక్రెట్ రివీల్ చేశారు ముఖ్యమంత్రి జగన్. మత్స్యకార భరోసా కింద వారందరికీ గతంలో ఇస్తున్న నాలుగు వేల రూపాయల స్థానంలో ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. మొత్తం 1,09,234 మంది మత్స్యకారులకు లబ్ది చేకూరుతుందని ఆయన వివరించారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రకటించిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళతామంటూ సీఎం సంచలన ప్రకటన చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ప్రారంభం కానున్న మత్స్యకార భరోసా కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన సహచర మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాతో పోరాడుతున్న క్లిష్ట సమయంలో ఇబ్బందులు పడని సామాన్య ప్రజలు లేరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కష్ట సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార భరోసా పేరిట పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

గతంలో చేపల వేటపై నిషేధం ఉన్న సమయంలో ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, అది కూడా అందరికీ చేరేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క మత్స్యకారునికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వివరించారు రాష్ట్రంలో ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్‌లను కట్టబోతున్నామని, ఒక ఫిష్ ల్యాండ్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. ఇందుకోసం దాదాపు మూడువేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాకనే తాము ఎన్నికలకు వెళతామని జగన్ వ్యాఖ్యానించారు.