అనార్కలీ అన్నందుకు మండిపడ్డ జయప్రద..!
తనను అనార్కలీ అన్నందుకు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీనటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద. ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు తనను ‘అనార్కలి’ అన్నందుకు అబ్దుల్లాపై ఫైర్ అయ్యారు జయప్రద. అబ్దుల్లా వ్యాఖ్యల పట్ల నవ్వాలో.. ఏడవాలో అర్థం కావాట్లేదన్నారు. తండ్రికి తగ్గట్టుగా కొడుకు కూడా తయారయ్యాడని.. సమాజంలో ఉన్న మహిళలను మీరు చూసే విధానం ఇదేనా..? అని ప్రశ్నించారు. ఇదే విధమైన కామెంట్స్ మరోసారి చేస్తే.. ఊరుకోనని స్పష్టం చేశారు. కాగా.. ఆమె ఉత్తరప్రదేశ్ రాంపూర్ […]
తనను అనార్కలీ అన్నందుకు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీనటి, బీజేపీ ఎంపీ అభ్యర్థి జయప్రద. ఎస్పీ నేత ఆజంఖాన్ కుమారుడు తనను ‘అనార్కలి’ అన్నందుకు అబ్దుల్లాపై ఫైర్ అయ్యారు జయప్రద. అబ్దుల్లా వ్యాఖ్యల పట్ల నవ్వాలో.. ఏడవాలో అర్థం కావాట్లేదన్నారు. తండ్రికి తగ్గట్టుగా కొడుకు కూడా తయారయ్యాడని.. సమాజంలో ఉన్న మహిళలను మీరు చూసే విధానం ఇదేనా..? అని ప్రశ్నించారు. ఇదే విధమైన కామెంట్స్ మరోసారి చేస్తే.. ఊరుకోనని స్పష్టం చేశారు. కాగా.. ఆమె ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.