IRCTC : టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది.. అయితే, కండిషన్స్ అప్లై.!
ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే రైలు ప్రయాణికులకు శుభవార్త. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి, వివిధ..
IRCTC Online Ticket Booking refund : ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్, మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే రైలు ప్రయాణికులకు శుభవార్త. IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి, వివిధ కారణాలతో రద్దు చేసుకున్న తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు, మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఇప్పటి వరకూ ఉండేది. అయితే, ఇప్పుడు ఈ కాలపరిమితిని తగ్గించింది ఐఆర్‌సీటీసీ. పేమెంట్ గేట్ వే ఐఆర్‌సీటీసీ – ఐపే ద్వారా టిక్కెట్లు బుక్ చేసే ప్రయాణీకులు రద్దు చేసిన వెంటనే టిక్కెట్ సొమ్ములు రీఫండ్ పొందనున్నారు.
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఐఆర్‌సీటీసీ-ఐపేను 2019లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐఆర్‌సీటీసీ తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది. రోజు రోజుకూ ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ తన యూజర్ ఇంటర్ ఫేస్ అప్ గ్రేడ్ చేసింది.
దీని వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతుండటమే కాక, తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరించినట్టు IRCTC వర్గాలు వెల్లడించాయి.
Read also : Earthquake : దేశరాజధానిలో వరుస భూ ప్రకంపనలతో ఆందోళనలో హస్తిన వాసులు