కిరణ్ మజుందార్ షాకు జరిమానా విధించిన ఇన్ఫోసిస్

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్…ఆ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షాకు గట్టి షాకిచ్చింది. ఏకంగా రూ.9,50,000 జరిమానా విధించింది. కంపెనీ ముందస్తు అనుమతి లేకుండా ఆమె 1,600 షేర్లను ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు కంపెనీ ఫిబ్రవరి 28న బీఎస్‌ఈకి తెలిపింది. కిరణ్ మజుందర్ షా పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఫిబ్రవరి 13న 1,600 ఇన్ఫోసిస్ షేర్లను ట్రేడింగ్ చేశారు. ఈ విషయం ఆమెకు కూడా తెలియదు. ఈ విధంగా అనుకోకుండా జరిగిన […]

కిరణ్ మజుందార్ షాకు జరిమానా విధించిన ఇన్ఫోసిస్
Follow us

| Edited By:

Updated on: Mar 01, 2019 | 1:17 PM

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్…ఆ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షాకు గట్టి షాకిచ్చింది. ఏకంగా రూ.9,50,000 జరిమానా విధించింది. కంపెనీ ముందస్తు అనుమతి లేకుండా ఆమె 1,600 షేర్లను ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు కంపెనీ ఫిబ్రవరి 28న బీఎస్‌ఈకి తెలిపింది.

కిరణ్ మజుందర్ షా పోర్ట్‌ఫోలియో మేనేజర్ ఫిబ్రవరి 13న 1,600 ఇన్ఫోసిస్ షేర్లను ట్రేడింగ్ చేశారు. ఈ విషయం ఆమెకు కూడా తెలియదు. ఈ విధంగా అనుకోకుండా జరిగిన ఘటనతో మజుందార్ షాపై రూ.9.5 లక్షల జరిమానా పడింది. జరిగిన ఘటనలో కిరణ్ మజుందార్ షా ప్రమేయం లేదు. ఆమెకు తెలియకుండానే ట్రేడింగ్ జరిగింది. అయినా కూడా కంపెనీ ఆడిట్ కమిటీ కిరణ్ మజుందార్ షా‌పై రూ.9.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మజుందార్ షా విజ్ఞప్తి మేర‌కు స్వచ్ఛంద సంస్థకు చెల్లించామని ఇన్ఫోసిస్ తెలిపింది.