స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఇండోర్‍కు మొదటి స్థానం
దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాకు […]

దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు.
- ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ ఏరియాకు ‘స్వచ్ఛమైన చిన్న నగరం’అవార్డు
- ‘ఉత్తమ గంగా పట్టణం’గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్
- అహ్మదాబాద్‌కు ‘స్వచ్ఛమైన పెద్ద నగరం’అవార్డు
- వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్)
- ‘మధ్య స్థాయి స్వచ్ఛమైన నగరం’గా మధుర (ఉత్తర ప్రదేశ్)
- వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరంగా బృందావన్ (యూపీ)