వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు
విజయవాడ: ఏపీలో డేటా వార్ కారణంగా టీడీపీ-వైసీపీల మధ్య కూడా వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు ఆ జిల్లా కలెక్టర్‌కు వైసీపీ మీద ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేని ఉమా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. తదితరులు కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసి తమ ఫిర్యాదు లేఖను అందించారు. ఫామ్ -7 ద్వారా వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ […]

విజయవాడ: ఏపీలో డేటా వార్ కారణంగా టీడీపీ-వైసీపీల మధ్య కూడా వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు ఆ జిల్లా కలెక్టర్‌కు వైసీపీ మీద ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేని ఉమా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.. తదితరులు కలెక్టర్ ఇంతియాజ్‌ను కలిసి తమ ఫిర్యాదు లేఖను అందించారు. ఫామ్ -7 ద్వారా వైసీపీ నాయకులు టీడీపీ పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.