బూట్లతో కొట్టుకున్న ఎంపీ, ఎమ్మెల్యే
ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ కోల్పోయి బహిరంగంగా ఘర్షణకు దిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా సమన్వయ సమావేశంలోనే బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే పబ్లిక్‌గా గొడవపడ్డారు. ఓ శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకంలో తన పేరు ఎందుకు లేదని స్థానిక ఎమ్మెల్యేను ఎంపీ శరద్ త్రిపాఠీ నిలదీశారు. అందుకు తనే వద్దన్నానని ఎమ్మెల్యే రాకేశ్ భగేల్ బదులిచ్చారు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ […]

ప్రజలకు మార్గదర్శకులుగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ కోల్పోయి బహిరంగంగా ఘర్షణకు దిగిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లా సమన్వయ సమావేశంలోనే బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే పబ్లిక్‌గా గొడవపడ్డారు. ఓ శంకుస్థాపన కార్యక్రమం శిలాఫలకంలో తన పేరు ఎందుకు లేదని స్థానిక ఎమ్మెల్యేను ఎంపీ శరద్ త్రిపాఠీ నిలదీశారు. అందుకు తనే వద్దన్నానని ఎమ్మెల్యే రాకేశ్ భగేల్ బదులిచ్చారు. దీంతో ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఎంపీ త్రిపాఠీ, ఆయనపై బూటుతో దాడిచేసి అసభ్య పదజాలంతో దూషించారు.
ఎంపీ చర్యలకు ఎమ్మెల్యే కూడా అదేరీతిలో స్పందించారు. అధికారులు, మీడియా ప్రతినిధులు ఎదురుగానే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. అక్కడే ఉన్న పోలీసు అధికారులు జోక్యం చేసుకుని వారిని పక్కకు తీసుకెళ్లారు. బాధ్యతారహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని యూపీ బీజేపీ అధ్యక్షుడు ఎంఎన్ పాండే తెలిపారు.