కొంపముంచిన బర్త్ డే పార్టీ..!
ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని హెచ్చరికలు చేసిన ఫలితం లేకుండాపోతోంది. భౌతిక దూరం పాటించక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఇచ్చిన పుట్టిన రోజు వేడుకలు వంద మంది పాలిట శాపంగా మారింది. అందులో ఇప్పటికే ఇద్దరు కరోనా లక్షణాలతో చనిపోయినట్లు సమాచారం
కరోనా కల్లోలం భాగ్యనగరంలో కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని హెచ్చరికలు చేసిన ఫలితం లేకుండాపోతోంది. భౌతిక దూరం పాటించక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏకంగా ప్రాణాల మీదికే తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఇచ్చిన పుట్టిన రోజు వేడుకలు వంద మంది పాలిట శాపంగా మారింది. అందులో ఇప్పటికే ఇద్దరు కరోనా లక్షణాలతో చనిపోయినట్లు సమాచారం.
హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ పెద్ద జ్యువెలరీ షాప్ యాజమాని కరోనాతో శనివారం కన్నుమూశాడు. అయితే, అంతకుముందు రోజే అతను ఓ మిత్రుడు ఇచ్చిన బర్త్ డే పార్టీకి వెళ్లినట్లు సమాచారం. అనంతరం కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ పార్టీలో జ్యువెలరీ అసోసియేషన్ నుంచి దాదాపు 100 మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఈ విందుకు అటెండ్ అయిన మరో ప్రముఖ జ్యువెలరీ షాప్ యజమాని కూడా కరోనా బారినపడి ఇవాళ ఆదివారం మృతి చెందాడు. బర్త్ డే పార్టీ మూలంగానే అతనికి కూడా కొవిడ్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. అయితే, ఈ బర్త్ డే వేడుకలకు హాజరైన మిగతా వ్యాపారుల్లో ఇప్పడు టెన్షన్ మొదలైంది. ఇప్పుడు వీళ్లందరూ భయంతో కరోనా టెస్టింగ్‌ల కోసం ప్రైవేట్ లేబొరేటరీస్‌కు పరుగెడుతున్నారని తెలిసింది. మరోవైపు పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారిని ట్రేస్ అవుట్ చేసే పనిలో పడ్డారు అధికారులు. అసలు ధావత్ ఇచ్చిన వ్యక్తికి కూడా కరోనా సోకి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు తెలుస్తోంది.