గోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత
గోవా ముఖ్యమంత్రి 63 ఏళ్ల మనోహర్ పారికర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 2000 నుంచి 2005 వరకూ 2012 నుంచి 2014 వరకూ పారికర్ గోవా సీఎంగా పనిచేశారు. 2014 నుంచి 2017 వరకూ రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2017 మార్చి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు. చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మారిన పారికర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఆర్ఎస్ఎస్ బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా […]
గోవా ముఖ్యమంత్రి 63 ఏళ్ల మనోహర్ పారికర్ కొంతకాలంగా పాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతూ కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు.
2000 నుంచి 2005 వరకూ 2012 నుంచి 2014 వరకూ పారికర్ గోవా సీఎంగా పనిచేశారు. 2014 నుంచి 2017 వరకూ రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 2017 మార్చి నుంచి సీఎంగా కొనసాగుతున్నారు.
చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా మారిన పారికర్ ఐఐటీలో గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే ఆర్ఎస్ఎస్ బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలకతీతంగా ఆయనకు అభిమానులున్నారు. పారికర్ కన్నుమూయడంతో బీజేపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.