హైదరాబాద్ ప్రజలకు 72 గంటల వార్నింగ్

అక్టోబర్ 12 మధ్యాహ్నం మొదలుకుని 72 గంటల పాటు అంటే దాదాపు 3 రోజులు హైదరాబాద్ మహానగర వాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.

హైదరాబాద్ ప్రజలకు 72 గంటల వార్నింగ్
Follow us

|

Updated on: Oct 12, 2020 | 3:53 PM

GHMC warns city people for heavy rains: అక్టోబర్ 12 మధ్యాహ్నం మొదలుకుని 72 గంటల పాటు అంటే దాదాపు 3 రోజులు హైదరాబాద్ మహానగర వాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెచ్చరిక జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ డీ.ఎస్.లోకేశ్ కుమార్. 72 గంటల పాటు మహానగరం పరిధిలోని పలు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ఆయనంటున్నారు.

వాతావరణ విభాగం హెచ్చరికల ప్రకారం మహానగరం పరిధిలో కొన్ని చోట్ల 9 నుంచి 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం వుందని లోకేశ్ కుమార్ తెలిపారు. రాబోయే 72 గంట‌ల పాటు అధికారులు, సహాయ బృందాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నగర ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా ఉండాలని ఆయన సూచించారు.

వాతావ‌ర‌ణ శాఖ జారీచేసిన అంచ‌నాల ప్ర‌కారం రాబోయే 72 గంట‌ల పాటు న‌గ‌రంలో అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు. అతి భారీ వ‌ర్షాల వ‌ల‌న ఏర్ప‌డే వ‌ర‌ద‌ ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు అధికారులు తమ ప‌రిధిలోని క్షేత్ర‌స్థాయి మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాల‌ను అప్ర‌మత్తంచేసి, అందుబాటులో ఉంచాల‌ని జోన‌ల్ క‌మిష‌న‌ర్లు, డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌ను లోకేశ్ కుమార్ ఆదేశించారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంట‌ర్లుగా గుర్తించిన పాఠ‌శాల‌లో, క‌మ్యునిటీహాల్స్‌, ఇత‌ర వ‌స‌తుల‌ను సిద్దంగా ఉంచాల‌ని సూచించారు. అధికారులంద‌రూ అందుబాటులో ఉండాల‌ని క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

Also read: ‘ఆ’ భవనాలను ఖాళీ చేయించండి: కేటీఆర్ ఆదేశం

Also read: కమలదళంలోకి ఖుష్బూ

Also read: ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక