రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు.

గ్రేటర్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం జరిగే బహిరంగసభలో పాల్గొననున్నారు. రేపు ఎల్‌బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ పోలీసలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎల్బీ స్టేడియం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరించారు. అలాగే, సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి మాస్క్ తప్పనిసరి అని, భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు పోలీసులు.
బహిరంగ సభకు వచ్చేవారికి పార్కింగ్ ప్రదేశాలుః
- సికింద్రాబాద్ వైపు నుంచి సభకు వచ్చే వాహనాలను పబ్లిక్ గార్డెన్, రవీంద్రభారతి, డాక్టర్ కార్స్ ప్రాంతాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేయాలి.
- ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్, ఓల్డ్ నుంచి వచ్చే వాహనాలకు పీపుల్ ప్లాజా వద్ద పార్కింగ్ అనుమతి.
- ముషీరాబాద్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీలో పార్కింగ్ సదపాయం.
- మెదీపట్నం నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పార్క్ చేయాల్సి ఉంటుంది.
- ఇక, టూ అండ్ త్రీ మీద వచ్చేవారు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం