అశోక్ గజపతి రాజు హాట్ కామెంట్స్ : ‘బ్యాంకుల ముందు చెత్త వేస్తే తప్పు.. మరి హిందూమతంపై దాడులు జరుగుతుంటే.!’
బ్యాంకుల ముందు చెత్త వేస్తే స్పందించిన కేంద్రం - హిందూమతంపై దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు కేంద్ర మాజీమంత్రి..
బ్యాంకుల ముందు చెత్త వేస్తే స్పందించిన కేంద్రం – హిందూమతంపై దాడులు జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు. చెత్తకు ఉన్న విలువ హిందూమతంకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస విచారణ లేకుండా తొమ్మిది ప్రధాన ఆలయాల కమిటీల ఏర్పాటుకు నియామకాలు జరుగుతున్నాయన్నారు. కావాలనే హిందూమతం పై దాడి జరుగుతుందని అశోక్ గజపతి రాజు ఆందోళన వ్యక్తం చేశారు. మాన్సస్ భూముల రికార్డులు మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.