2020 ఆంధ్రప్రదేశ్ రౌండప్ : సంచలన ఘటనలు, ఉత్కంఠరేపిన ఉదంతాలు, జనాన్ని భయకంపితుల్ని గావించిన గాథలు.!

2020 Round Up కరోనా ఏడాదిగా మిగిలిన 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ప్రతిష్టంభనతోపాటు, పలు షాకింగ్ ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి...

2020 ఆంధ్రప్రదేశ్ రౌండప్ : సంచలన ఘటనలు, ఉత్కంఠరేపిన ఉదంతాలు, జనాన్ని భయకంపితుల్ని గావించిన గాథలు.!
Follow us

|

Updated on: Dec 31, 2020 | 7:59 PM

2020 Round Up కరోనా ఏడాదిగా మిగిలిన 2020వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ప్రతిష్టంభనతోపాటు, పలు షాకింగ్ ఉదంతాలు కూడా చోటు చేసుకున్నాయి. మన్సాస్ ట్రస్ట్ కీలక పరిణామాలు, ఏలూరు వింత వ్యాధితోపాటు, అంతర్వేది రథం దగ్ధం ఘటన, వివిధ జిల్లాల్లో హత్యలు, ఆత్మహత్యలు, ఇలా నేటితో ముగుస్తోన్న ఏడాది, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అనేక చెరిగిపోని అధ్యాయాల్ని నమోదు చేసి వెళ్తోంది.

సీబీఐ చేతికి వైఎస్ వివేకానంద హత్య కేసు :

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలకఘట్టం 2020లో చోటుచేసుకుంది. ఈ హత్యోదంతం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు మార్చి 11వ తేదీన సంచలన తీర్పు వెలువరించింది. 2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

వైఎస్ వివేకానంద హత్య కేసు దర్యాప్తులో జగన్ సర్కారుకి ఎదురుదెబ్బ :

2019 ఎన్నికలకు ముందు, అంటే.. మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురికాగా, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే, అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా మరో సిట్‌ను ఏర్పాటు చేశారు. కానీ, విచారణ సరిగ్గా జరగడం లేదని, వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని దివంగత వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత, అలాగే టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అదే సమయంలో సీఎం జగన్ సర్కారు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకుంది. ఈ పిటిషన్‌పై వాదనలు జరగ్గా.. ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోందని, సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని జగన్ ప్రభుత్వం కోర్టులో వాదనలు వినిపించింది. ఇరువరి వాదనలు విన్న కోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు :

ఏపీలో 2020 మార్చి 12వ తేదీన మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. నెల్లూరుకు చెందిన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇటలీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఆ యువకుడు అక్కడి నుంచి నెల్లూరు రాగా, కోవిడ్ 19గా తేలింది. అటుపై రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అత్యధిక కేసులు వచ్చాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి తీవ్రత రాష్ట్రంలో నిలకడగా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ, రాష్ట్రం మొత్తం అష్టదిగ్భంధనం :

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా మార్చి 23వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మొదటిసారి లాక్‌డౌన్ ప్రకటించారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని సరిహద్దులు మూసివేశారు. దేశం మొత్తం లాక్ డౌన్ అయితేనే పరిస్థితి అదుపులోకి వచ్చే పరిస్థితి ఉందని జగన్ తన ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. ఏపీ నుంచి వేరే ప్రాంతాలకు గాని, ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి రాకపోకలను పూర్తిగా నిలిపిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, వాణిజ్య, సామాజిక, సాంఘీక కార్యక్రమాలన్నిటినీ రాష్ట్రంలో నిషేధించారు. .

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు :

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ కరోనా మహమ్మారి జడలు విరబోస్తున్న వేళ తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్టర్లకే రక్షణ లేదంటూ విమర్శించారు. దీంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ మే నెల 16వ తేదీన విశాఖలో డాక్టర్ సుధాకర్ ప్రత్యక్షమయ్యారు. దీంతో సుధాకర్‌ను విశాఖ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే, సుధాకర్ ను అరెస్ట్ చేసిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

డాక్టర్ సుధాకర్ కేసు సీబీఐకి అప్పగింత :

విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ ను అరెస్ట్ చేసిన అనంతరం అతని మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు చెప్పడంతో.. పోలీసులు ఆయన్ను ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారించిన జరిపింది. అంతేకాదు, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, విశాఖ పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.

బంగారం దొంగతనం ఆరోపణలతో కర్నూలు సలాం ఫ్యామిలీ సూసైడ్ :

బంగారం దుకాణంలో పనిచేసే కర్నూలు జిల్లాకు చెందిన సలాం ఫ్యామిలీ సామూహిక ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పాణ్యం సమీపంలోని కౌలూరు దగ్గర నవంబర్ 3వ తేదీన రైలు కిందపడి అబ్ధుల్ సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. బంగారం దొంగతనం కేసులో పోలీసుల వేధింపులు తాళలేక సలాం, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. సలాం ఓ బంగారం దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. షాపులో మూడు కేజీల బంగారం దొంగతనం చేశాడంటూ సలాంపై గతేడాది నంద్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు ఒత్తిడి చేయడంతో సలాం మనస్థాపానికి గురై సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు అబ్దుల్ సలాం కుటుంబం సెల్ఫీ వీడియో తీసుకుంది. పోలీసులు తనకు చోరీ కేసును అంటగట్టారని.. ఈ దొంగతనం కేసుకు.. తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. తన కుటుంబానికి సాయం చేసేవారెవరూ లేరని, దొంగతనం కేసు అంటగట్టడంతోనే మానసిక క్షోభకు గురై కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు సలాం సదరు వీడియోలో పేర్కొన్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నివర్ తుఫాన్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నివర్ తుఫాన్ అతలాకుతలం చేసింది. నవంబర్ 26, 27 తేదీల్లో కుండపోత వర్షాలకు అనేక జిల్లాలు వణికిపోయాయి. ఎడతెరిపి లేకుండా పడిన వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా పడింది. తుఫాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై ఎక్కువగా కనిపించింది. తిరుపతి సహా తూర్పు మండలాల్లో పెద్దఎత్తున నీరు చేరింది.

ఏలూరులో అంతుబట్టని వింత వ్యాధి :

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింతవ్యాధి కలకలం రేపింది. స్థానిక ప్రజలు, చిన్నాపెద్దా తేడా లేకుండా ఉన్నట్లుండి ఫిట్స్ కు గురై నిట్టనిలువునా కొట్టకుపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి ముగ్గురు, 5 న పదుల సంఖ్యలో మంది అస్వస్థతకు గురై, కళ్లుతిరిగి పడిపోయారు. మొత్తం 610 మందికి పైగా అస్వస్థకు గురయ్యారు. అయితే ఇది జరిగిన వారం రోజుల వరకు ఇలా ఎందుకు జరిగిందో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కలేదు. చివరికి ఆహారంలో రాసాయన మందులు కవవడం వల్లే ఇలా జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

కరోనా పీడ వదలకముందే, ఏపీలో తొలి కరోనా స్ట్రెయిన్ కేసు :

అసలే, మందులేని కరోనా వ్యాధితో జనజీవనం అతలాకుతలమవుతుంటే, 2020 ముగింపు దశలో న్యూ స్ట్రెయిన్ వైరస్ పేరిట ఆంధ్రప్రదేశ్‌పై మరో పిడుగులాంటి వార్త పడింది. డిసెంబర్ 29న ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ కేసు నమోదైంది. ఇంగ్లాండు నుంచి రాజమండ్రి వచ్చిన ఓ మహిళకు కరోనా స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ అధికారికంగా ప్రకటించారు.

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్
హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్