కేసీఆర్ ఇలాకాలో క‌రోనా క‌ల‌క‌లం..మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వ్య‌క్తికి వైర‌స్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకాలో తొలి క‌రోనా కేసు న‌మోదుకావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వ్య‌క్తికి వైర‌స్ సోకింది.

కేసీఆర్ ఇలాకాలో క‌రోనా క‌ల‌క‌లం..మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వ్య‌క్తికి వైర‌స్‌
Follow us

|

Updated on: Apr 01, 2020 | 2:07 PM

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. భార‌త్‌లోను క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా దేశం న‌లుమూల‌ల‌కు విస్త‌రించిన వైర‌స్ జ‌డ‌లు విప్పుకుంటోంది. ఒక్కో జిల్లా నుంచి మెల్ల‌మెల్ల‌గా క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంత‌కంత‌కు ఈ కేసుల సంఖ్య పెరిగిపోతూ వ‌ణుకుపుట్టిస్తోంది. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకాలో తొలి క‌రోనా కేసు న‌మోదుకావ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల మ‌ర్క‌జ్ వెళ్లొచ్చిన వ్య‌క్తికి వైర‌స్ సోకింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టారు.
సిద్ధిపేట జిల్లా ప్రజలకు ఇది షాకింగ్ న్యూస్. సిద్దిపేట‌లో తొలి కరోనా కేసు న‌మోదయ్యింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతానికి చెందిన  51ఏళ్ల వ్య‌క్తి కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు  జిల్లా కలెక్టర్ వెంకట్‌రామిరెడ్డి ప్రకటించారు. ఇత‌డు కూడా ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడికి కరోనా వైరస్ లక్షణాలు ఉండడంతో రెండు రోజుల క్రిత‌మే అత‌న్ని సిద్ధిపేటలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయ‌గా, కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అత‌న్ని హుటాహుటినా..హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, నిజాముద్దీన్ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు సిద్ధిపేట నుంచి మొత్తం ఆరుగురు వెళ్లిన్న‌ట్లుగా గుర్తించారు. అంద‌రినీ క్వారంటైన్‌కు త‌ర‌లించ‌గా, అందులో ఇద్ద‌రికీ క‌రోనా వైర‌స్ అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. వారి నుంచి శాంపిల్స్ సేక‌రించి టెస్ట్‌కు పంపాగా, ఇందులో ఒక‌రికి వైర‌స్ సోకిన‌ట్లుగా తెలిసింది. ఇంకోక‌రి రిపోర్ట్స్ రావాల్సి ఉంద‌న్నారు. ————————————

Latest Articles
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం